Siddipet Incident
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Crime News: ‘దృశ్యం-2’ తలపించేలా అత్తను హత్య చేసిన అల్లుడు

Crime News: ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా, భావోద్వేగం, ఇంటెలిజెన్స్ మేళవింపుతో చిత్రీకరించిన ఫ్యామిలీ సినిమా ‘దృశ్యం-2’లో హీరో వెంకటేష్ పాత్ర అత్యంత ఆసక్తికరంగా (Crime News) కొనసాగుతుంది. పోలీసుల్ని కూడా మోసం చేసే విధంగా కొనసాగే రాంబాబు పాత్ర (వెంకటేశ్) సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. అచ్చం అదే తరహాలో అత్తను హత్య చేసి అందరి కళ్లుగప్పి ఇన్సూరెన్స్ సొమ్ము కాజేయాలని చూసిన ఓ అల్లుడి బాగోతం (Crime News) సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాన్‌సాన్‌పల్లి‌లో బయటపడింది. ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో 60 ఏళ్ల వయసున్న రామవ్వ అనే వృద్ధురాలు మృతి చెందగా, పోలీసుల దర్యాప్తులో విస్తుగొల్పే నిజాలు బయటపడ్డాయి.

రూ.60 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం..

రామవ్వ మరణం ప్రమాదం కాదని, హత్య చేసినట్టుగా దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. రూ. 60 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం అల్లుడు వెంకటేశ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని వివరించారు. సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు వెల్లడించారు. పెద్దమాన్‌సాన్‌పల్లి గ్రామ శివారులో ఈ నెల 7న కారు ఢీకొని రామవ్వ చనిపోయిందని, రోడ్డు ప్రమాదంలో చనిపోయాదంటూ నిందితుడు వెంకటేశ్ అమాయకుడి మాదిరిగా వచ్చి ఫిర్యాదు చేశాడని వివరించారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా, కారును నడిపిన కరుణాకర్ అనే వ్యక్తిని ప్రశ్నించగా అసలు విషయాలు చెప్పాడు. ప్రమాద బీమా కోసం అల్లుడు వెంకటేశ్ ఈ హత్య చేయించినట్లు ఒప్పుకున్నాడు. తాను చెప్పినట్టు నడుచుకుంటే బీమా డబ్బులో సగానికి సగం ఇచ్చేస్తానంటూ వెంకటేశ్ తనతో సుపారీ కుదుర్చుకున్నాడని కరుణాకర్ వివరించాడు.

Read Also- Viral News: గుహలో రష్యన్ మహిళ, ఇద్దరు పిల్లలు.. కర్ణాటకలో షాకింగ్ ఘటన

పొలం పనుల కోసం తీసుకెళ్లి..
అత్త రామవ్వను హత్య చేసేందుకు వెంకటేశ్ పక్కా ప్రణాళికతో వ్యవహారించాడు. ఇదివరకే రామవ్వపై పలు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. పొలం పనులు ఉన్నాయంటూ అత్త రామవ్వను ఊరికి తీసుకెళ్లాడు. స్కెచ్ ప్రకారం, హత్య జరిగిన రోజు రాత్రి పొలం నుంచి ఒంటరిగా రామవ్వను ఇంటికి వెళ్లాలని కోరాడు. అప్పటికే కరుణాకర్‌కు ఒక అద్దె కారును వెంకటేశ్ పురమాయించాడు. ఇంటికి కాలినడకను వెళ్తున్న ఆమెను కరుణాకర్ వేగంగా కారుతో బలంగా ఢీకొట్టాడు. ఆ తర్వాత కారు ప్రమాదంలో చనిపోయినట్టుగా డ్రామాలు ఆడారు. అయితే, కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు కారు నడిపిన కరుణాకర్‌ను గుర్తించారు. దీంతో, నిజాలు బయటపడ్డాయి. నిందితుడు వెంకటేశ్ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు వెంకటేశ్ గతంలో పౌల్ట్రీ ఫామ్‌ బిజినెస్ చేసి సుమారుగా రూ.22 లక్షల వరకు నష్టపోయినట్టు తెలుస్తోంది. ఆ నష్టాల నుంచి తేరుకోవడానికి ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. మృతురాలు రామవ్వ పేరిట పోస్టాఫీసు బీమా, ఎస్‌బీఐ ఇన్సూరెన్స్‌, రైతు బీమా చేయించాడని పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు.

Read Also- Screen Time: పిల్లలు మొబైల్ వినియోగంపై అధ్యయనం.. వెలుగులోకి నమ్మలేని నిజాలు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు