Hydra (imagecredit:twitter)
హైదరాబాద్

Hydra: నాలాలకు కబ్జాల నుంచి విముక్తి.. ఆక్రమణలపైనే దృష్టి

Hydra: నిన్నమొన్నటి వరకు ట్రై సిటీల్లో సర్కారుకు చెందిన ఆస్తులైన చెరువులు, కుంటలకు సంబంధించి స్థలాలకు కబ్జాల నుంచి విముక్తి కల్గించిన హైడ్రా(Hydraa) ఇపుడు నాలాలపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వర్షాకాలం కావటంతో నాలాలు పొంగి ప్రవహించి పలు నివాసాలను ముంచే ప్రమాదమున్న ప్రాంతాల్లోని నాలాలను గుర్తించి ఆక్రమణలను తొలగించటంతో పాటు నాలాల్లోని పూడికను తీసే పనులు కూడా చేపట్టింది. కానీ ప్రతి సంవత్సరం నాలాల్లోని పూడికతీత పనులు, వర్షాకాలం సహాయక చర్యలను చేపట్టే బాధ్యతలను జీహెచ్ఎంసీ(GHMC) నుంచి కట్ చేసి హైడ్రాకు అప్పగిస్తూ మున్సిపల్ శాఖ కార్యదర్శి ఇలంబర్తి(Ilambarthi) ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెల్సిందే.

కానీ అప్పటికే జీహెచ్ఎంసీ నాలా పూడికతీత పనులను ప్రారంభించిందని ప్రకటించుకున్నా, తొలుత కేవలం ఆక్రమణలపైనే దృష్టి సారించాలని భావించిన హైడ్రా క్షేత్ర స్థాయిలో నాలాల పరిస్థితిని గమనించి, నాలా పూడికతీత పనులను కూడా చేపట్టింది. ప్రస్తుతం నగరంలోని నాలా పరిస్థితులు బీఫోర్ హైడ్రా, ఆఫ్టర్ హైడ్రా గా మారింది. హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో కల్వర్టులు క్లియర్ అవుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు, థర్మోకోల్, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించడంతో పూడుకు పోయిన నాలాలు, కల్వర్టులు తెరుచుకున్నాయి. లారీల కొద్దీ చెత్తను తొలగించడంతో వరద సాఫీగా వెళ్లేందుకు మార్గం సుగమం చేస్తుంది.

Also Read: Medak Crime: కల్లు సీసాతో పొడిచి.. బండ రాయితో దారుణ హత్య

1 నుంచి మొదలైన పనులు
ఈ నెల 1వ తేదీ నుంచి హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు, హైడ్రా డీఆర్ఎఫ్(DRF) బృందాలు సంయుక్తాధ్వర్యంలో ఆపరేషన్ నాలా(Oparation Nala), కల్వర్టుల క్లీనింగ్ పనులు మొదలయ్యాయి. జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో మొత్తం నాలాలను, కల్వర్టులను, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాలను ఈ బృందాలు జల్లెడ పట్టి, ప్రాధాన్యత క్రమంలో క్లీనింగ్ పనులు హైడ్రా చేపట్టింది. వర్షం పడినప్పుడు వరద నీరు నిలబడకుండా, రోడ్లపై ట్రాఫిక్ జామ్(Traffic Jam) ఏర్పడకుండా బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. హైడ్రా డీఆర్ఎఫ్ అధికారులు క్షేత్రస్థాయిలో సర్కిళ్లవారీ ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

దీంతో నాలాలు, కల్వర్టులు రూపు రేఖలు మారుతున్నాయి. పిచ్చి మొక్కలతో, పేరుకుపోయిన చెత్తతో ఉన్న మ్యాన్ హోల్స్, కల్వర్టులు ఇపుడు నీరు సక్రమంగా ప్రవహించేందుకు క్లియర్ అవుతున్నాయి. మురుగు, వరద నీరు ముందుకు కదలకుండా ఉక్కిరిబిక్కిరి అయిన నాలాలు, కల్వర్టులు ఎంతటి వ్రవాహాం వచ్చిన సజావుగా సాగేందుకు వీలుగా మారుతున్నాయి. కాలువ పరిసరాల్లో నివాసముంటున్న ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా వర్ష సూచన లేని రోజుల్లోనే వీలైనంత ఎక్కువ పొడువున నాలాలను క్లీన్ చేయాలని హైడ్రా భావిస్తున్నట్లు సమాచారం.

నాలాల్లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా
నాలాల్లో చెత్తనే కాదు ఆక్రమణలను కూడా హైడ్రా తొలగించుతోంది. ఖైరతాబాద్ శ్రీధర్ ఫంక్షన్ హాల్ వద్ద బుల్కాపూర్ నాలా ఆక్రమణలను తొలగించింది. కూకట్పల్లి ఐడీఎల్ చెరువు నాలా ఆక్రమణలను కూడా నేలమట్టం చేసింది. ఖైరతాబాద్ చౌరస్తా వద్ద నాలా కల్వర్టులో పెద్దఎత్తున పేరుకుపోయిన వ్యర్థాలను హైడ్రా యుద్ధప్రాతిపదికన తొలగించింది. లాంగ్ ఆర్మ్ జేసీబీ తో చెత్తతో పాటు థర్ర్మోకోల్, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి తరలించింది.

Also Read: Kota Srinivas Rao Death: కోట శ్రీనివాసరావు మృతికి వాళ్లే కారణమా? అవకాశాలు అడిగినా ఇవ్వలేదా?

 

Just In

01

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు