Congress leaders (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Congress leaders: సీఎం రేవంత్ రెడ్డి యే బిసి క్యాంపెనర్.. ఆంజనేయులు గౌడ్

Congress leaders: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యే బిసి(BC) క్యాంపెనర్ అని,ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్(Congress) పార్టీ సిద్ధంగా ఉందని మెదక్ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్, డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ లు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 42 శాతనికి పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తా లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి స్విట్లు పంచుకొని సంబురాలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బిసిలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప వరం 42శాతం రిజర్వేషన్లు అని వారు కొనియాడారు.

పార్టీ పరంగా ఇచ్చేందుకు సిద్ధం
బిసి రిజర్వేషన్లు అడ్డుకునే పార్టీలకు పుట్టగతులుండవని వారు హెచ్చరించారు. ఇప్పటివరకు చట్టసభల్లో మెట్లు ఎక్కని కులాల కోసమే బిసి రిజర్వేషన్లు పెంచుతున్నామన్నారు.ఇప్పటికే బిసి బిల్లు అమోధించి కేంద్రానికి పంపామని, దానికి ఆమోదం తెలిపి 9వ షెడ్యూల్ లో చేర్చాలని ప్రధానిని కొరామన్నారు. ఒకవేళ అందులో చేర్చడం ఆలస్యమయితే స్థానిక సంస్థల్లో పార్టీ పరంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రిజర్వేషన్ ల అంశం పార్టీలకు అతీతమైందని,దీనిపై రాజకీయాలు చేయొద్దని వారు విజ్ఞప్తి చేశారు. బిసి రిజర్వేషన్‌ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంటే బిఆర్ఎస్(BRS) నేతలు అడ్డగోలుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, దేశానికి స్వాతంత్యం తెచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని వారు గుర్తు చేశారు.

Also Read: Vadhannapet: వర్ధన్నపేట మండలంలో మట్టిబొమ్మకు పూజలు.. జనం పరుగులు

అభివృద్ధికి అడ్డుపడితే సహించేదిలేదు
మెదక్ అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీలేదని స్పష్టం చేశారు. పదేండ్ల బిఆర్ఎస్ పాలనపై, 18నెలల కాంగ్రెస్ పాలనపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. పదేండ్లలో భూ మాఫియా, ఇసుక మాఫియా, మట్టి మాఫియాలు మెదక్ లో రాజ్యమేళాయని వారు విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ మెదక్‌ను సర్వ నాశనం చేసిందని, ఒక్కొక్కటి చేసుకుంటూ మెదక్‌ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అభివృద్ధికి అడ్డుపడితే సహించేదిలేదని వారు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్, బీజేపీ లకు ప్రజలు తగిన బుద్దిచెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు సుప్రభాతరావ్, రాజిరెడ్డి,శ్రీనివాస్ చౌదరి ప్రశాంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రమేష్ రెడ్డి, మధుసూదన్ రావ్, గంట రాజు, ముత్యం గౌడ్,శంకర్, అశోక్, బొజ్జ పవన్, సాన సత్యనారాయణ, నాగరాజు, అక్బర్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పరుశరామ్ గౌడ్, లక్ష్మి నారాయణ గౌడ్, గోదల జ్యోతి, హరిత నర్సింగ్ రావ్, నోముల శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Also Read: Central on CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి వినతిపై స్పందించిన కేంద్రం!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!