Central on CM Revanth( image credit: twitter)
తెలంగాణ

Central on CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి వినతిపై స్పందించిన కేంద్రం!

Central on CM Revanth: తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని విధాలా సహకారం అందిస్తామని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి జేపీ  (JP Nadda) నడ్డా హామీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)  నేతృత్వంలోని బృందం కేంద్రమంత్రిని కలిసి రాష్ట్రానికి సరిపడా యూరియా, (Urea)ఎరువులు సరఫరా చేయాలని కోరారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జూలై, ఆగస్ట్ నెలల్లో యూరియాను నిరాటంకంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

 Also Read: Uttam Kumar Reddy: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణకు అన్యాయం!

చర్యలు తీసుకోవాలి

ముఖ్యమంత్రి విజ్ఞప్తిపై స్పందించిన కేంద్రమంత్రి నడ్డా రైతుల (Farmers)  అవసరాలను తీర్చడానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. (Telangana ) తెలంగాణకు అవసరమైన మేరకు సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా, రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సమానంగా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కోరారు. ఇదే సమయంలో తెలంగాణలో యూరియా వినియోగం పెరుగుతుండడంపై కేంద్రమంత్రి నడ్డా ఆందోళన వ్యక్తం చేశారు. 2023 – 24 యాసంగితో పోలిస్తే 2024 – 25 యాసంగిలో యూరియా అమ్మకాలు 21 శాతం అధికమయ్యాయని అన్నారు. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించి, సేంద్రీయ, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ప్రణామ్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నదని నడ్డా గుర్తు చేశారు.

 Also Read: Asia Oldest Elephant: ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు