Asia Oldest Elephant (image Source: Twitter)
Viral

Asia Oldest Elephant: ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగు కన్నుమూత.. ప్రముఖుల సంతాపం!

Asia Oldest Elephant: ఆసియాలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా కీర్తి గడించిన ‘వత్సల’ (Vatsala) అనూహ్యాంగా ప్రాణాలు విడిచింది. మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్‌ రిజర్వ్‌లో తుదిశ్వాస విడిచినట్లు అధికారులు ప్రకటించారు. ఏనుగు ముందు కాళ్ల గోళ్లకు గాయాలు కావడంతో అభయారణ్యంలోని ఖైరైయాన్‌ కాలువ సమీపంలో కూర్చొని ఉండిపోయిందని అధికారులు తెలిపారు. వైద్యులు, సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ పైకి లేవలేకపోయింది. అనంతరం మృతిచెందినట్లు పన్నా టైగర్‌ రిజర్వ్‌ ప్రకటన విడుదల చేసింది. 100 ఏళ్లకు పైగా బతికిన ఈ ఆడ ఏనుగును ‘దాదీ మా’, ‘నాని మా’ అనే పేర్లతోనూ పిలిచేవారు.

వత్సల జీవిత విశేషాలు
1971లో కేరళలోని నీలాంబూర్ అడవుల్లో తొలిసారి వత్సలను అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)కు తీసుకొచ్చారు. మొదట నర్మదాపురంలో ఉంచబడిన ఈ ఏనుగు.. 1993లో పన్నా టైగర్ రిజర్వ్‌ (Panna Tiger Reserve)కు తరలించబడింది. మరణించే వరకూ అక్కడే ఉండిపోయింది. కాగా పన్నా టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణి సంరక్షణలో వత్సల కీలక పాత్ర పోషించింది. పులుల జాడలను గుర్తించడంలో విశేష సేవలు అందించింది. అలాగే ఇతర ఏనుగు పిల్లలకు తల్లిలా సంరక్షణ అందించడం చేసింది.

Also Read: Shubman Gill: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన గిల్.. కెరీర్‌లోనే ది బెస్ట్ ప్లేస్ కైవసం!

ప్రముఖుల సంతాపం
వత్సల మృతిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ (Mohan Yadav) సంతాపం తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా ఏనుగుకు శ్రద్ధాంజలి ఘటించారు. మరోవైపు పన్నా ఎంపీ బ్రీజేంద్ర ప్రతాప్ సింగ్ (Brijendra Pratap Singh) సైతం వత్సల మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అటు నెటిజన్లు సైతం వత్సల మరణం గురించి తెలుసుకొని సోషల్ మీడియాలో సంతాపం తెలియజేశారు. కాగా పన్నా టైగర్ రిజర్వ్ సిబ్బంది వత్సల అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు