Vadhannapet: ఆధునిక కంప్యూటర్ కాలంలోనూ మూఢనమ్మకాలు(Superstitions) గ్రామీణ ప్రాంత ప్రజల అమాయకత్వాలను ఆసరాగా చేసుకుంటున్నా మోసగాళ్లు క్షుద్ర పూజలు(Occult worship), బాణామతులు, చేతబడుల పేరుతో ప్రజలను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు. తాజాగా మండలంలోని కాట్రపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కాట్రపల్లి మొరిపిరాల ప్రధాన రోడ్డు మార్గంలోని గొల్లవానికుంట సమీపంలో ఉన్న బెల్లి ఎల్లయ్య(Belli Ellaiah) పశువుల కొట్టంలో గుర్తుతెలియని అగంతకులు క్షుద్ర పూజలకు పాల్పడ్డారు. మంగళవారం సాయంత్రం బాధిత రైతు ఎల్లయ్య తన పశువులను కొట్టంలో కట్టేసి ఇంటికి చేరుకున్నాడు.
పాత దుస్తులు వేస్తూ క్షుద్ర పూజలు
సుమారు ఆర్దరాత్రి దాటిన తర్వాత అగంతకులు పశువుల పాకలో మట్టి బొమ్మను(Clay doll) తయారుచేసి పసుపు కుంకుమ బుక్కగు లాలు నిమ్మకాయలతో ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం తెల్లవారు జామున పశువుల కొట్టం వద్దకు చేరుకున్న ఎల్లయ్య దొడ్లో జరిగిన తతం గాన్ని చూసి షాకయ్యాడు. పశువుల కొట్టంలో క్షుద్ర పూజలు జరిగిన విషయం గ్రామంలో దావానంల వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి చూశారు. కాగా గ్రామంలోని ఈ మధ్యకాలంలో ప్రధాన కూడళ్లలో ప్రతి ఆదివారం, గురువారం, బుధవారం కొబ్బరికాయలు, నిన్నుకా యలు. జీడిగింజలు, గవ్వలు, పసుపు కుంకుమలు, పాత దుస్తులు వేస్తూ క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. దీంతో అటుగా వెళుతున్న ప్రజలు, ప్రయాణికులు భయాందోళలనకు గురవుతున్నారు.
Also Read: Congress on KTR: మెదక్ ప్రజలను గాడిదలు అన్న కేటిఆర్.. ఎస్పీకి ఫిర్యాదు
సీసీ కెమెరాలను ఎర్పాటు చేయాలి
గ్రామాలలోని సీసీ కెమెరాలు లేకపోవడంతో ఇట్టి సంఘటనలు అధికమవుతున్నాయని గ్రామస్తులు ఆందోలన వ్యక్తంచేస్తున్నారు. గ్రామంలో పోలీస్ ఉన్నతాధికారులు పర్యటిస్తూ ప్రజలకు మూడనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు చేసి తెలియచేయాలని తెలిపారు. గ్రామంలో పటిష్టమైన ఎర్పాట్లు చేసి సీసీ కెమెరాలను ఎర్పాటు చేయాలని వాటిరి ఎప్పటికప్పుడు తనీకీలు చేస్తూ జనాలను భయాందోలనకు గురిచేస్తున్న వారిని కనిపెట్టి వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read: Gadwal MRO: సామాన్యులకు రేషన్ కార్డుల తిప్పలు