Jasprit Bumrah: లండన్‌లోని ప్రతిష్టాత్మక లార్డ్ మైదానం వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య కీలకమైన మూడో టెస్ట్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 387 పరుగులకు ఆలౌట్ చేయడంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఐదు వికెట్లతో అద్భుతంగా రాణించాడు. రెండో రోజు ఆటలో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ప్రత్యర్థి జట్టు స్టార్ బ్యాటర్లు బెన్ స్టోక్స్ (44), జో రూట్ (104), క్రిస్ వోక్స్ (0) వికెట్లు తీసి భారత్‌కు భారీ ఊరటనిచ్చాడు. అంతేకాదు, హాఫ్ సెంచరీ సాధించిన బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్‌లను కూడా కూడా ఔట్ చేసి 5 వికెట్ల ఫీట్ సాధించాడు. దీంతో, లార్డ్స్ హానర్స్ బోర్డులో బుమ్రా తన పేరును లిఖించుకున్నాడు. అరుదైన ఈ మైలురాయిపై రెండవ రోజు ఆట ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ బుమ్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
Read Also- Air India Flight Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. తెరపైకి కొత్త అనుమానాలు.. పైలెటే మెయిన్ విలనా?
ప్రధాన తేడా ఇదే
మనుపటి ఇంగ్లాండ్ పర్యటనలో నేర్చుకున్న అంశాలే ఈసారి తనను విజయవంతంగా నిలబెట్టాయని జస్ప్రీత్ బుమ్రా చెప్పాడు. గత పర్యటన సమయంలో లార్డ్స్ మైదానంలో ఉండే వాలు (స్లోప్) గురించి ఎక్కువగా ఆలోచించానని, కానీ, అది తనకు ఏమాత్రం ఉపయోగపడలేదని తెలిపాడు. అందుకే, ఈసారి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా బౌలింగ్ చేశానని, ఈ వేడి వాతావరణంలో కొత్త బంతిని మెరుగ్గా ఉపయోగించుకోవడంపై దృష్టిసారించానని వివరించాడు. మునుపటి పర్యటనకు, ప్రస్తుత పర్యటనకు మధ్య ప్రధాన తేడా ఇదేనని పేర్కొన్నారు.
Read Also- Kangana Ranaut: ఎంపీగా ఏడాది పూర్తి.. కంగనా అభిప్రాయం ఇదే
21 ఏళ్ల యువకుడిని కాదు
లార్డ్స్ మైదానంలో హానర్స్ బోర్డుపై పేరు లిఖించడంపై బుమ్రా స్పందిస్తూ, ఇది తనకు ఎంతో ప్రత్యేకమైనదని, తన కొడుకు పెద్దయ్యాక దీని గురించి చెబుతానని చెప్పాడు. ‘‘వాస్తవం ఏంటంటే, నేను బాగా అలసిపోయాను. 21 ఏళ్ల వయసున్న యువకుడిలా నేను ఉత్సాహంగా ఆడలేను. అయినప్పటికీ జట్టు కోసం రాణించడం చాలా సంతోషంగా ఉంది. హానర్స్ బోర్డుపై నా పేరు రాయడం చాలా బాగుంది. నా కొడుకు పెద్దయ్యాక వాడికి దీని గురించి చెబుతాను” అని బుమ్రా పేర్కొన్నాడు. కాగా, లార్డ్స్ టెస్టులో బుమ్రా మొత్తం 74 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో, 387 పరుగులకే పరిమితమైంది. ఇక, రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 145/3 పరుగులుగా ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 53 (బ్యాటింగ్), రిషబ్ పంత్ 19 (బ్యాటింగ్) ఉన్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13), కరుణ్ నాయర్ (40), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (16) స్వల్ప స్కోర్లకు ఔట్ అయ్యారు. నాలుగో వికెట్‌కు రాహుల్–పంత్ కలిసి 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడవ రోజు వీరిద్దరూ పటిష్టంగా రాణిస్తే భారత్ నిలబడుతుంది. లేదంటే, ఇబ్బందులపాలైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
Read Also- Mia Zelu: ఆమె అసలు మనిషే కాదు.. ఫొటోలు చూసి నమ్మకండి