Mia Zelu
Viral, లేటెస్ట్ న్యూస్

Mia Zelu: ఆమె అసలు మనిషే కాదు.. ఫొటోలు చూసి నమ్మకండి

Wimbledon 2025: ఉత్కంఠభరితంగా సాగుతున్న వింబుల్డన్ 2025కి సంబంధించిన విశేషాల్లో మియా జెలు (Mia Zelu) అనే యువతికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి. వింబుల్డన్ మ్యాచ్‌లతో పాటు వివిధ టెన్నిస్ ఈవెంట్లకు హాజరైనట్లు ఆమె కనిపిస్తున్న ఫొటోలు బాగా వైరల్‌గా మారాయి. అయితే, మోడ్రన్ ఫ్యాషన్‌ దుస్తుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆమెను చూసి నిజమైన మనిషేమోనని అనిపించొచ్చు, కానీ ఆమె మనిషి కాదు. ఆ ఫొటోలన్నీ కృత్రిమ మేధస్సుతో (AI) సృష్టించినవే. ఇన్‌స్టాగ్రామ్ ఏకంగా 1.5 లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్న మియా జెలు అసలు మనిషి కాదు. ఆమె ఏఐ ఆధారిత సోషల్ మీడియా ఇన్‌ఫ్లువెన్సర్.

వింబుల్డన్ పోస్టులు వైరల్
వింబుల్డన్‌ వేదికల వద్ద దిగినట్టుగా మియా జెలుకు సంబంధించిన ఫొటోలు తెగ వైరల్‌గా మారాయి. తొలిచూపులో ఎంతో సహజంగా, నిజంగా మనిషిలా అనిపిస్తుంది. ఒక ఫొటోలోనైతే ఆమె తెల్లటి దుస్తుల్లో, కూల్ డ్రింక్ తాగుతున్నట్టుగా చాలా అందంగా కనిపించింది. ఈ చిత్రం చూసినవారెవరూ మనిషి కాదని అనుకునే అవకాశమే ఉండదు. మియా జెలుకు సంబంధించిన ఇలాంటి ఫొటోలు చాలానే ఉన్నాయి. ఫొటోలే కాదు, మియా జెలు సోషల్ మీడియా పోస్టులకు రాసే క్యాప్షన్లు కూడా భావోద్వేగపూరితంగా, ఆకట్టుకునేలా అనిపిస్తాయి.

Read Also- Air India Flight Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. తెరపైకి కొత్త అనుమానాలు.. పైలెటే మెయిన్ విలనా?

అద్భుతమైన సందేశాలు

తెల్లని డ్రెస్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసిన పోస్టులో మియా జెలు చక్కటి సందేశం ఇచ్చింది. “మ్యాచ్ ఇంకా ముగియలేదు. మ్యాచ్‌ వేరే లెవెల్లో ఉంది. మీకు బాగా నచ్చిన వింబుల్డన్ మ్యాచ్ ఏది?” అని ప్రశ్నించింది. కొన్ని గంటలక్రితం కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ‘‘మీరు సాధించినప్పుడే వారి కళ్లకు కనిపిస్తుంది. కష్టాలు ఎదుర్కొన్న రోజులన్నీ మీకే గుర్తుంటాయి. ముందుకు సాగుతూనే ఉండండి. మౌనంగా, ఒంటరిగా సందేహపడుతూ, గుండెల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్న కష్టపడుతున్నవాళ్లందరికీ చెబుతున్నాను. మీరు మధ్యలో ఆగకండి. మీ టైమ్ రాబోతుంది. అప్రతిహతంగా ముందుకు సాగిపోండి. ఎప్పటికీ ఆగివద్దు” అని సందేశం ఇచ్చింది. ఈ పోస్ట్‌కు మింట్ గ్రీన్ డ్రెస్‌ ధరించినట్టుగా ఉన్న ఫోటోలను మియా జెలు జోడించింది.

Read Also- AirIndia Crash: ఎయిరిండియా క్రాష్‌కు కారణం ఇదేనా!.. అస్సలు ఊహించలేదు!

ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఇదే
మియా జెలు ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో డిజిటల్ క్రియేటర్ అని ఉంది. డిజిటల్ స్టోరీటెల్లర్, ఇన్ఫూయెన్సర్-ఏఐ అని కూడా జోడించి ఉంది. అయితే, ఈ అకౌంట్‌ను క్రియేట్ చేసిన ఈ ఏఐ ఇన్‌ఫ్లువెన్సర్‌ను రూపొందించిన వ్యక్తి ఎవరో తెలియరాలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మియా జెలుకు ఏఐ టెక్నాలజీతో సృష్టించిన ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరు ఆనా జెలు. “నా ప్రియమైన సోదరి మియా జెలును కలవండి. ఆమె నాకు ఇష్టమైన ఫోటోగ్రాఫర్‌‌ను కూడా!. ఎట్టకేలకు ఆమె కూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసింది. ఆమెకు అందరూ చక్కగా ఆహ్వానం పలకండి!” అని మార్చి నెలలో ఆనా జెలు ఒక పోస్టు పెట్టింది.

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది