Indian Origin Couple: అమెరికాలోని పాశ్చాత్య జీవితాన్ని వదిలిపెట్టి.. భారత్ లో నాణ్యవంతమైన జీవనాన్ని గడపాలని ఓ ప్రవాస జంట భావిస్తోంది. ప్రస్తుతం 30+లో ఉన్న ఆ జంట.. గత 15 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తోంది. అయితే తమ ఉద్యోగాలను వదులుకొని శాశ్వతంగా భారత్ కు వచ్చేయాలని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. భారత్ లో త్వరగా పదవి విరమణ చేసి తమ బిడ్డను హాయిగా పెంచడానికి ఎంత డబ్బు అవసరమవుతుందని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ రెడ్డిట్ (Reddit) వేదికగా భారతీయులను కోరారు.
వివరాల్లోకి వెళ్తే..
సెక్యూర్ సాల్ట్ (Secure Salt) అనే యూజర్ నేమ్ తో ఉన్న ఒక రెడ్డిట్ (Reddit User) యూజర్ ఇలా రాశారు. ‘మేము 30+ ఉన్నాము. మాకు ఒక బిడ్డ ఉన్నాడు. దాదాపు 15 ఏళ్లుగా యూఎస్ (USA)లో నివసిస్తున్నాము. కొన్ని కారణాల రిత్యా మేము భారత దేశానికి తిరిగి వెళ్లాలని ఆలోచిస్తున్నాం. భారత్ కు వచ్చాక కొంతకాలం విరామం తీసుకొని.. తిరిగి ఉద్యోగాల బాట పడతాం. అయితే భారత్ లో త్వరగా పదవి విరమణ చేసి పిల్లలను పెంచుతూ సౌకర్యవంతంగా జీవించడానికి ఏది మంచి సంఖ్య (ఎంత డబ్బు అవసరం)’ అని ఓ వ్యక్తి ప్రశ్నించారు.
చేతిలో రూ.46 కోట్ల ఆస్తి
ప్రస్తుతం తమ ఆస్తుల విలువ 5.5 మిలియన్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.46 కోట్లు) అని సదరు యూజర్ తెలిపారు. ప్రస్తుతం తాము యూఎస్ పౌరులుగా ఉంటున్నామని.. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) హోదాను సైతం కలిగి ఉన్నట్లు చెప్పారు. అయితే ఈ దంపతుల వద్ద అధిక మెుత్తంలో డబ్బు ఉన్నప్పటికీ.. వారు త్వరగా భారత్ కు తరలి వచ్చేందుకు ఆలోచనలో ఉన్నారు. తమ బిడ్డ జీవితాన్ని భారత్ లో ఎలా అర్థవంతంగా తీర్చిదిద్దాలోనని యోచిస్తున్నారు.
రెడ్డిట్ యూజర్ల సలహాలు
భారత్ లో నివసించాలన్న ప్రవాస భారత జంట ఆలోచనను పలువురు రెడ్డిట్ యూజర్లు స్వాగతిస్తున్నారు. ఢిల్లీ (Delhi), ముంబయి (Mubai) మినహా.. భారత్ లోని ఏ నగరంలోనైనా కొంత కాలం పనిచేయకుండా జీవిచండానికి 3 మిలియన్లు సరిపోతాయని ఓ యూజర్ అభిప్రాయపడ్డారు. అయితే ఇది మీ జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. మరొకరు మాట్లాడుతూ.. సెకండ్ గ్రేడ్ సిటీల్లో జీవించాలని భావిస్తే.. నెలకు రూ.75,000 కు ఖర్చు మించదని పేర్కొన్నారు. బిడ్డ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు నెలకు రూ.30-35 వేల వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. ఒకవేళ ముంబయిలోని బాద్రా వంటి ఖరీదైన ప్రాంతాల్లో నివసించాలని భావిస్తే.. నెలకు రూ.2 లక్షల వరకూ ఖర్చు అవుతుందని మరొక యూజర్ చెప్పారు.
Also Read: GPO in Revenue Village: ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో.. ఈ నెల 27వ తేదీన అర్హత పరీక్ష
భారత్‌లో ఆ సమస్యలు తప్పవు!
మీరు రూ.2-4 కోట్ల ఫ్లాట్ కొని రూ.10 సంవత్సరాల్లో అమ్మినా లేదా అద్దెకు ఇచ్చినా మంచి లాభం వస్తుందని వేరొక రెడ్డిట్ యూజర్ సూచించారు. లేదంటే 3-4 ఫ్లాట్స్ తీసుకొని.. ఒక దాంట్లో మీరు ఉంటూ మిగిలిన వాటిని అద్దెకు ఇవ్వవచ్చని సలహా ఇచ్చారు. ఇక మీరు పిల్లలు పనిచేయాల్సిన అవసరం లేకుండా జీవితాంతం అద్దె మీదనే బతికేయవచ్చని పేర్కొన్నారు. అయితే కొందరు వినియోగదారులు మాత్రం భారత్ రావాలన్న ఆ జంట నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇక్కడి ట్రాఫిక్, దుమ్ము దూళి, కాలుష్యం, అవినీతి, శాంతి భద్రతల సమస్య, వేడి, ఉక్కపోత వాతావరణం ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.