Gold Monitation
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Gold: ఇళ్లలో దాచుకున్న బంగారంపై కీలక ప్రతిపాదన.. మోదీ ఏం చేయబోతున్నారు?

Gold: బంగారంతో భారతీయులకు ప్రత్యేక అనుబంధం ఉందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మతపరమైన, ఆర్థికపరమైన కోణాల్లో విశిష్ట ప్రాధాన్యత ఉంది. అంతకుమించి భారతీయ వనితలు స్వర్ణాభరణాలను అమితంగా ఇష్టపడతారు. రేట్లు పెరిగిపోతున్నా వెనుకా ముందు ఆలోచించకుండా పెద్ద ఎత్తున కొని దాచుకుంటున్నారు. పెట్టుబడిగా సాధనంగానూ చాలా మంది పరిగణిస్తుంటారు. అందుకే, బంగారాన్ని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలిచింది. రాజుల నాటి కాలంలో భారత్‌ను ‘సోనే కి చిడియా’ అని పిలిచేవారు. ఇక్కడ లభించిన బంగారాన్ని ఆంగ్లేయుల నుంచి విదేశీ రాజుల వరకు చాలామంది దోచుకెళ్లారు. అయితే, దేశంలో బంగారానికి ఏమాత్రం కొదువలేదు.

గోల్డ్ డిపాజిట్లపై నిర్ణయం ఉంటుందా?గోల్డ్ డిపాజిట్లపై నిర్ణయం ఉంటుందా?

ఎటూ కదలకుండా ఇళ్లలో మగ్గుతున్న బంగారాన్ని అధికారికంగా బయటకు తీసుకురావడానికి, దిగుమతులు తగ్గించుకోవడంలో సహాయ పడడానికి అవసరమయ్యే కీలక సూచనలు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గోల్డ్ కంపెనీలు లేఖలు రాశాయి. రాబోయే బడ్జెట్‌లో బంగారం డిపాజిట్లకు అనువైన కాలపరిమితి, అధిక వడ్డీ రేట్లు అందించడం ద్వారా ఇళ్లల్లో మగ్గుతున్న బంగారాన్ని బయటక తీయవచ్చునని లేఖలో సూచించారు. ప్రత్యేక పథకం కింద పూర్వీకులకు చెందిన 500 గ్రాముల బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే పన్ను పరిధిలోకి తీసుకురాకూదదని, పన్ను విచారణ లేకుండా చేయాలని సిఫార్స్ చేశారు. ఈ తరహా నిబంధనలు అమల్లోకి తీసుకొస్తే బంగారం ద్రవ్యీకరణ పథకం (జీఎంఎస్) పుంజుకుంటుందని సూచించారు.

Read Also- AirIndia Crash: ఎయిరిండియా క్రాష్‌కు కారణం ఇదేనా!.. అస్సలు ఊహించలేదు!

మరోవైపు, బ్యాంకు లాకర్లలో నిల్వ ఉన్న బంగారాన్ని బయటకు తీసుకురావడానికి కస్టమర్లను ఒప్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి, ప్రసిద్ధి గోల్డ్ రిటైల్ వ్యాపారుల సహకారాన్ని కోరుతున్నారు. ఇందుకోసం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను సరించాలని సూచిస్తున్నారు. ఈ స్కీమ్ కింద పెద్ద మొత్తంలో బంగారాన్ని సమీకరించేందుకు అవకాశం ఉన్నప్పటికీ విశ్వసనీత కారణంగా ఇన్వెస్టర్ల భాగస్వామ్యం తక్కువైందని చెబుతున్నారు. ఇళ్లలోని బంగారాన్ని సమీకరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకొస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, విదేశాల నుంచి బంగారం దిగుమతులను గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు. గోల్డ్ దిగుమతుల కోసం భారత్ పెద్ద మొత్తంలో విదేశీ మారక నిల్వలను ఉపయోగిస్తోంది. అదే నిరుపయోగంగా ఇళ్లలో మూలుగుతున్న బంగారాన్ని బయటకు తీస్తే భారీ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మన దేశంలో ఇళ్లలో మూలుగుతున్న బంగారాన్ని బయటకు తీసుకొస్తే, మరో 35 ఏళ్లపాటు విదేశాల నుంచి గోల్డ్ దిగమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదనే అంచనాలున్నాయి. ఇదే సమయంలో దేవాలయాల్లోని బంగారంపై కూడా చర్చ జరుగుతోంది. మరి వచ్చే బడ్జెట్ సమయానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

22 వేల టన్నుల బంగారం నిల్వలు
ఈ మధ్య వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించిన నివేదిక ప్రకారం, భారతీయ మహిళల వద్ద దాదాపు 22,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దాని విలువ దాదాపు 1 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనాగా ఉంది. అంటే, వంద లక్షల కోట్లకు పైమాటే. ప్రపంచంలోని టాప్-5 బ్యాంకుల్లో కూడా ఇంత బంగారం లేదంటే మనవాళ్లు ఎంత బంగారాన్ని కొనుగోలు చేశారో అర్థం చేసుకోవచ్చు.

Read Also- Gurugram Case: కూతుర్ని అందుకే చంపేశా.. సంచలన నిజాలు చెప్పిన రాధిక తండ్రి

 

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?