Viral News: చాలామందికి గుర్తుండే ఉండొచ్చు, 2021లో మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే అనే మహిళ ఒకే కాన్పులో ఏకంగా 9 మంది పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఆశ్చర్యం ఏమిటంటే పుట్టిన బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు. వాళ్లంతా ఈ మధ్యే 4వ పుట్టిన రోజు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి హలీమా సిస్సే తాను గర్భవతిగా ఉన్నప్పుడు, డెలివరీ సమయం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన భర్త అబ్దుల్‌ఖాదర్ అర్బీతో కలిసి పలు అంశాలను పంచుకున్నారు. ‘మరపురాని జ్ఞాపకాలు’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ షేర్ చేశారు. “జీవితంలో ఒక అద్భుతం. మేము చాలా దూరం వచ్చేశాం. మా ప్రయాణం ప్రారంభమైన నాటి నుంచి లభించిన అన్ని రకాల మద్దతుకు రుణపడి ఉన్నాం” అని తెలియజేస్తూ ఒక వీడియో క్లిప్‌ను పంచుకున్నారు.
Read Also- Fitness Tips: ఫిట్‌నెస్ విషయంలో ఎవరూ చెప్పని 5 బెస్ట్ టిప్స్ ఇవే
పాత ఫొటోలు షేరింగ్
హలీమా-అబ్దుల్‌ఖాదర్ దంపతులు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను షేర్ చేశారు. పిల్లలను తమ ఒళ్లో పట్టుకున్న ఫొటోలు, పుట్టిన వెంటనే ఆసుపత్రిలో తీసిన ఫొటోలు, వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్న దృశ్యాలు, పిల్లల్ని చూసి కుటుంబ సభ్యులు మురిసిపోతున్న దృశ్యాలు వంటి ఆసక్తికర చిత్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. చారిత్రాత్మక ఈ ప్రసవ ఘట్టానికి ముందు రోజుల్లో హలీమా మంచంపై పడుకొని ఉన్న ఫొటోలు, ఆమె తీసుకున్న ఆహారానికి సంబంధించిన ఫొటోలు కూడా కనిపించాయి. ఒకే ప్రసవంలో అత్యధికంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మనివ్వడంతో పాటు శిశువులంతా జన్మించినట్టుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇచ్చిన సర్టిఫికెట్ ఫొటోను కూడా షేర్ చేశారు.
Read Also- Karan Johar: కరణ్ జోహార్‌కు ఏమైంది?.. మరీ ఇలా మారిపోయారేంటి?

నిజానికి హలీమా ఏడుగురు పిల్లలను మోస్తున్నట్లు మొదట గుర్తించారు. దీంతో, ఆమె ఆరోగ్యం పట్ల మాలి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆమెను, ఆమె భర్తను మొరాకోలోని ఒక స్పెషలిస్ట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేసింది. అక్కడి వెళ్లాక పరీక్షలు జరపగా కడుపులో ఉన్నది ఏడుగురు కాదు, మొత్తం 9 మంది అని బయటపడింది. వైద్యుల పర్యవేక్షణలో 2021 మే 4న, కేవలం 30 వారాల వయసున్న శిశువులు ఒకే కాన్పులో 9 మంది జన్మించారు. నలుగురు మగ, ఐదుగురు ఆడగా గుర్తించారు. వీళ్లంతా 0.5 నుండి 1 కేజీ (1.1 నుంచి 2.2 పౌండ్లు) బరువు ఉన్నారు. దీంతో, ఒకే కాన్పులో పుట్టి బతికిన తొలి 9 మంది కవలలుగా చరిత్ర సృష్టించారు.
కాగా, 2021లో ఒకేసారి తొమ్మిది మంది శిశువులకు జన్మనిచ్చిన సమయంలో హలీమా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఆ పిల్లలకు మొహమ్మద్ VI, ఎల్హాద్జీ, ఔమర్, బాహ్, కడిడియా, ఫటౌమా, హవా, అదామా, ఔమౌ అని హలీమా-అబ్దుల్‌ఖాదర్ పేర్లు పెట్టారు. 4వ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ 57 వేలమంది ఫాలోయర్లకు ఒక పోస్ట్ ద్వారా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం పిల్లలందరూ ఆరోగ్యంగా ఉన్నారు. తమ అక్క అర్బీతో (6 సంవత్సరాలు) కలిసి ఆనందంగా ఆడుకుంటున్నారు.