Karan Johar: కరణ్ జోహార్‌కు ఏమైంది?.. ఇలా మారిపోయారేంటి?
Karan Johar
Viral News, లేటెస్ట్ న్యూస్

Karan Johar: కరణ్ జోహార్‌కు ఏమైంది?.. మరీ ఇలా మారిపోయారేంటి?

Karan Johar: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) వెయిట్ లాస్ అంశం కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంటోంది. బరువు తగ్గుదల కోసం ఆయన ‘ఓజెంపిక్’ అనే ఔషధాన్ని ఉపయోగించి ఉండొచ్చంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫొటోలో ఆయన చాలా సన్నగా కనిపించారు. దీంతో, ఆయన వెయిట్ లాస్ అయ్యారా?, లేక అనారోగ్యంతో ఉన్నారా? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కరణ్ జోహార్‌కు సంబంధించి వైరల్‌గా మారిన కొత్త ఫొటో అభిమానుల ఆందోళనలకు కారణమవుతోంది.

ఆ ఫొటో ఇదే
ఈ వారం మొదట్లో కరణ్ జోహార్‌‌తో కలిసి దిగిన ఒక ఫొటోను కమెడియన్ సమయ్ రైనా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘భారతదేశంలో అత్యుత్తమ ప్రతిభగలవారిని పరిచయం చేసిన వ్యక్తి’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే, ఆ ఫొటోలో వదులుగా ఉన్న దుస్తులు ధరించి ఉన్న కరుణ్ జోహర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లేత బూడిద రంగు దుస్తుల్లో నిలబడి సన్ గ్లాసెస్‌ పెట్టుకొని కనిపించారు. ఈ ఫొటో అభిమానుల్లో అనుమానాలు పెంచుతోంది. బరువు బాగా తగ్గిపోవడంతో ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది యూజర్లు రెడిట్ పోస్ట్‌పై కామెంట్‌ సెక్షన్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

కరణ్ జోహర్ అనారోగ్యంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నారంటూ చాలామంది కామెంట్ చేశారు. సింప్సన్‌లో (టీవీ యానిమేటెడ్ సిరీస్) ‘మిస్టర్ బర్న్’ మాదిరిగా ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. కఠినమైన ఆహార నిబంధనలు పాటిస్తూ, క్రీడలకు సంబంధించిన వ్యాయామం చేస్తున్నట్టు ఆయన ఇదివరకే కన్ఫార్మ్ చేశారని మరికొందరు గుర్తుచేస్తున్నారు. అయితే, ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన వాలకం భయమేస్తుందని, అనారోగ్య సమస్య పెద్దదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకీ వ్యామోహం
“కరుణ్ జోహార్ ఇంతకు ముందు చాలా మంచిగా కనిపించేవారు. ఇప్పుడు బరువు తగ్గి పోషకాహార లోపం ఉన్న వ్యక్తిలా మారిపోయారు. ఈ విధంగా కనిపించడంపై వ్యామోహం ఏమిటో నాకు అర్థం కావడం లేదు’’ అని ఒక యూజర్ రాసుకొచ్చాడు. ‘‘ ఆయన బాగానే ఉన్నారు. మంచి ఆరోగ్యంతో ఉన్నారని నేను భావిస్తు్న్నాను. కరుణ్ జోహార్, వాళ్ల అమ్మ ఇద్దరూ కలిసి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటున్నారు” అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

“ఆయన ఏదో బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు కదా?. ఈ విధంగా బరువు తగ్గడం ఆరోగ్యానికి మంచిదని అనుకోకండి” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించాడు. మరొకరు స్పందిస్తూ, “కరుణ్ ఆరోగ్యంగా కనిపిస్తున్నారని భావించకండి. మంచిగా ఉండాలని ఆశిద్దాం’’ అని పేర్కొన్నాడు. “ఓహ్ మై గాడ్! నాకు ఆయనను చూస్తుంటే బాధగా ఉంది” అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఓజెంపిక్’ ఔషదం దుష్ప్రభావాలతోనే ఈ విధంగా తయారయ్యి ఉండొచ్చని పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఊహించిన దానికంటే వేగంగా కుంగిపోతున్నారని, లేక, వృద్ధాప్యం ఆయనను తరుముకొస్తుందా? ఏంటి అని ఒకరు రాసుకొచ్చారు. కాగా, 2024 నుంచి, కరణ్ జోహర్ బరువు తగ్గడంపై దృష్టిసారించారు. అప్పటి నుంచి ఆయన షేర్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గుతున్నట్టుగా 2024 ప్రారంభంలో కరణ్ జోహర్ ప్రకటించారు.

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు