Congress on KTR: మెదక్ జిల్లా ప్రజలను బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మాట్లాడుతూ గాడిదలు అని అన్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని మెదక్(Medak) జిల్లాలోని కాంగ్రెస్(Congress) నేతలు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావుకు వినతి పత్రం ఇచ్చారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్, మెదక్ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటిఆర్(KTR) మెదక్ ప్రజలను గాడిదలు అని సంబోధించారని ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
Also Read: TG Tourism: టూరిజంపై మంత్రి స్పెషల్ ఫోకస్.. ఇప్పటికే కొంతమంది పనితీరుపై అసంతృప్తి!
సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన
తెలంగాణలో మాట్లాడలేని భాషను క్రియేట్ చేసింది కేసీఆర్(KCR) అని వారు ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన వైపు కృషి చేస్తుంటే ఓర్వలేక బీఅర్ఎస్(BRS) శ్రేణులు ఓర్వలేక మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండి పడ్డారు. రాబోయే స్తానిక సంస్థల ఎన్నికల్లో బీఅర్ఎస్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మెదక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్,శ్రీనివాస్ చౌదరి, బొజ్జ పవన్, గంగాధర్, రాగి అశోక్, శ్రీనివాస్, ఆంజనేయులు గౌడ్, ముత్యం గౌడ్, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ramachandra Rao: గజ్వేల్‌ల్లో కాంగ్రెస్ నేతలకు షాక్.. బీజేపీకి కొత్త బలం