Ramachandra Rao: గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తో సహా పలువురు మాజీ కౌన్సిలర్లు, మాజీ వార్డు సభ్యులు, కుల, వృత్తి సంఘాల నాయకులు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రామచంద్రరావు చేతుల మీదుగా కాషాయం కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. బిజెపి(BJP) రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు(Ramchander Rao) భాస్కర్ తో పాటు మాజీ కౌన్సిలర్లు సుభాష్ చంద్రబోస్, నరసింహ చారి, రొట్టెల రామదాసు, గజ్వేల్ నరసింహులు మాజీ వార్డు సభ్యులు పూలసత్యం, కుమార్ లతోపాటు పలు సంఘాల నాయకులు దేవదాస్, మురళి, బద్రి, మార్కండేయులు తదితరులకు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా కాంగ్రెస్(Congress) పార్టీ నుండి బిజెపిలోకి మారుతున్న నాయకులంతా గజ్వేల్ కోట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హైదరాబాద్(Hyderabad) కు తరలి వెళ్లారు.
గజ్వేల్ నుండి చేరికలు మొదలు పార్టీకి బలం
తాను బిజెపి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) నియోజకవర్గం గజ్వేల్(Gajwel) నుండి చేరికలు మొదలు కావడం పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుందని రామచంద్రరావు పేర్కొన్నారు. గజ్వేల్ లో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలకు నాయకులకు తాను అన్ని విధాల అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో(Local Body Election) ఎక్కువ శాతం సీట్లను కైవసం చేసుకుని తమ సత్తా చాటడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.
Also Read: Heavy Rainfall Alert: మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు!
కాంగ్రెస్, బిఆర్ఎస్ లపై ప్రజల్లో వ్యతిరేకత
గత ప్రభుత్వ పరిపాలన విధానాలకు విసుకు చెందిన ప్రజలు కాంగ్రెస్(Congress)కు పట్టం కడితే తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతకు గురైందని ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) పేర్కొన్నారు. ప్రజలు బిజెపి(BJP) వైపు చూస్తున్నారని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సాధించాలన్నారు. ప్రజల సమస్యల పట్ల నాయకులు చిత్తశుద్ధితో పనిచేసి వారి మనసులను గెలుచుకోవాలని సూచించారు. తాను ఇక నుండి గజ్వేల్ పై ప్రత్యేక శ్రద్ధ పెడతానన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పలువురు పాల్గొన్నారు.
Also Read: Bhairavam OTT: ‘భైరవం’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?