Heavy Rainfall Alert: పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతున్నది. రానున్న రెండు రోజుల్లో ఇది ఛత్తీస్‌గఢ్, (Chhattisgarh) జార్ఖండ్ దిశగా ముందుకు వెళ్లనున్నది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ (Department of Meteorology) అధికారులు తెలిపారు.
Also Read: KTR Challenges CM Revanth: చర్చకు రాకుంటే ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
తెలంగాణకు అలర్ట్
తెలంగాణలో (Telangana) మూడు రోజులపాటు భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడుతాయని, ఇంకొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అలర్ట్ చేశారు. ఆ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నదని తెలిపారు. సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, యాదాద్రి, సిరిసిల్ల, నల్గొండ, కరీంనగర్, జనగామ జిల్లాల్లో మోస్తారు వానలు పడతాయని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ విభాగం తెలిపింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో (Hyderabad) భారీ వర్షం పడింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, యూసఫ్ గూడ, నిజాంపేట, లింగం పల్లి, కూకట్ పల్లి, (Kukatpally) కాప్రా, తిరుమలగిరి, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. అలాగే, మేడ్చల్, కీసర, ఘట్ కేసర్, దమ్మాయిగూడ ఏరియాల్లోనూ వానలు పడ్డాయి.
ఏపీలో వానలు
మరోవైపు, ఏపీలోనూ మూడు రోజుల పాటు వర్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా, యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నదని, కొన్ని చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు, సముద్రం అలజడిగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచనలు చేశారు.
Also Read: Fish Venkat: ప్రభాస్ చేయలేదు.. ఆ యంగ్ హీరో సాయం చేశాడు