Vishwak Sen Helps to Fish Venkat
ఎంటర్‌టైన్మెంట్

Fish Venkat: ప్రభాస్ చేయలేదు.. ఆ యంగ్ హీరో సాయం చేశాడు

Fish Venkat: ఫిష్ వెంకట్ అంటే టాలీవుడ్‌లో తెలియనివారు ఉండరు. కామెడీ విలన్‌గా తెలుగు ప్రజలకు సుపరిచితుడు. దాదాపు 90 సినిమాల్లో నటించి కామెడీ విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థతి సరిగా లేక బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఆర్థిక పరస్థితి సరిగాలేక కొన్ని రోజులుగా దాతల సాయం కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇదే సందర్భంలో హీరో ప్రభాస్ పీఏను మాట్లాడుతున్నా అంటూ ఒకరు ఫోన్ చేశారు. ఫిష్ వెంకట్ పరిస్థితి అర్థం చేసుకున్న ప్రభాస్ రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారంటూ వారికి తెలిపారు. దీంతో ఆయన కుటంబ సభ్యులు మీడియా ముందు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకు కాల్ వచ్చిన నెంబర్ నుంచి వివరాలు తెలుసుకుందామని తిరికి కాల్ చేయ్యగా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు షాక్ తగిలింది. ఆ నెంబర్ పనిచేయడం లేదంటూ తెలియడంతో కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. ప్రభాస్ టీం నుంచి కూడా అధికారిక ప్రకటన కూడా ఏమీ రాకపోవడంతో అది ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా చేసి ఉంటారని అభిప్రాయ పడుతున్నారు.

Also Read –Congress: కేటీఆర్‌కు భట్టి, పొంగులేటి ఓపెన్ ఛాలెంజ్.. స్వీకరిస్తారా?

ప్రభాస్ సంగతి ఏమో గానీ, ఫిష్ వెంకట్‌కు ఆర్థిక సాయం అందించేందుకు యంగ్ హీరో ఒకరు ముందుకొచ్చారు. తన వంతుగా రూ.2 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో తన టీమ్‌ ద్వారా ఫిష్ వెంకట్ కుంటుంబానికి అందజేశారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరంటే.. మాస్ కా దాస్ విష్వక్ సేన్. దీనికి సంబంధించిన వీడియోను ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిష్ వెంకట్‌కు రెండు కిడ్నీలు పాడవడంతో ప్రస్తుతం డయాలసిస్ చేస్తున్నారు. అత్యవసరంగా కిడ్నీ మార్చాల్సిన అవసరం ఉందని ఇప్పటికే ఆ కుటుంబానికి వైద్యులు తేల్చి చెప్పారు. కిడ్నీ మార్చడానికి దాదాపు రూ.50 లక్షల వరకూ అవుతాయని తెలపడంతో కుటుంబ సభ్యులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌లో ఉన్న హీరోలు ఎవరైనా ముందుకు వచ్చి తగిన సాయం అందించాలని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆర్థిక సాయం అందించిన విష్వక్ సేన్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read – Upasana: చరణ్‌కు అయ్యప్ప.. నాకు సాయి బాబా!

యంగ్ హీరో హీరో విష్వక్ సేన్ టాలీవుడ్‌లో డైనమిక్ పర్సన్‌గా పేరు తెచ్చుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ టాలెంట్‌తో తన ముద్ర వేసుకున్నారు. ‘వెళ్ళిపోమాకే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో దర్శకుడిగా మారారు. అనంతరం ‘ఈ నగరానికి ఏమైందీ’, ‘హిట్: ది ఫస్ట్ కేస్’ ‘దాస్ కా ధమ్కీ’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన ‘లైలా’ సినిమాతో తనకు నటనపై ఉన్న ఆసక్తిని ప్రేక్షకులకు తెలియజేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?