Stampede at Godown( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Stampede at Godown: ఒక్కసారిగా గోడౌన్‌ దగ్గరకు అన్నదాతలు!

Stampede at Godown: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గో డౌన్ వద్ద యూరియా కోసం రైతులు ఎగబడ్డారు. ఈ క్రమంలో రైతుల మధ్య స్వల్ప తోపులాట కూడా చోటు చేసుకుంది. యూరియా వచ్చిన విషయం తెలియడంతో రైతులు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో గోడౌన్ వద్దకు చేరుకున్నారు. తీసుకునేందుకు పోటీ పడడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు.

 Also Read: Mulugu District: హిడ్మా తప్పించుకున్నాడా? కర్రెగుట్టల వద్ద మళ్లీ కూంబింగ్

రైతన్నల ఆవేదన

ఉదయం నుంచి గంటల తరబడి లైన్ లోనే వేచి ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరిపడా యూరియా సరఫరా చేయకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నదని రైతులు తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు బదులుగా గత ప్రభుత్వాలు అందజేసిన విధంగా ఫర్టిలైజర్ షాపులోనే అందజేస్తే తమకు సులభంగా ఉంటుందని రైతులు ప్రభుత్వాన్నీ కోరుతున్నారు. యూరియా కోసం ఫర్టిలైజర్ దుకాణాలకు వెళ్తే వారు మందు డబ్బాలు, గుళికలు, నానో డీఏపీలు కొనుగోలు చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు పేర్కొన్నారు.

 Also Read:Mulugu District: రాజకీయ దుమారం రేపిన రమేష్ ఆత్మహత్య 

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?