Mulugu District: ములుగు జిల్లాలో పోలీసులు వర్సెస్ బీఆర్ఎస్ నాయకులు అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితి సాగుతోంది. చల్వాయి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇండ్ల ( Indiramma house) ఆశావహుడు చుక్క రమేష్ (Chukka Ramesh) మృతితో ములుగు జిల్లాలో ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్ నాయకుల తీరుతోనే చుక్కా రమేష్ పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని వారి కుటుంబ సభ్యుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. చుక్క రమేష్ ఆత్మహత్య, ములుగు జిల్లాలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ (BRS party) శ్రేణులు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో (Police) పోలీసులు ములుగు జిల్లాలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ (BRS) నాయకుల ఇళ్ళ ముందు పహార కాస్తున్నారు. కాంప్లికేటెడ్ చేస్తారని నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి (Police) పోలీస్ స్టేషనులకు తరలిస్తున్నారు.
ముందస్తు అరెస్టు
ములుగు జిల్లాలో ప్రజా నిరసన కార్యక్రమంలో పాల్గొంటారనే బిఆర్ఎస్ (BRS) నాయకులను గుర్తించి తెల్లవారుజామున నాలుగు గంటలకే వారి ఇళ్ల వద్ద (Police) పోలీసులు పహార కాశారు. అనుమానం వచ్చిన నేతలను ముందస్తుగా అరెస్టు చేసి సంబంధిత (Police) పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతాం పోలీసులు, కాంగ్రెస్ నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన తాము చేయదలచుకున్న ప్రజా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని బీఆర్ఎస్ (BRS) నాయకులు స్పష్టం చేస్తున్నారు. (Mulugu District) ములుగు జిల్లాలో సీతక్క, (Seethakka) సీతక్క ప్రధాన అనుచరుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ (Ashok ) అరాచక పాలనకు తెర లేపుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.
Also Read: SPDCL: విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నెంబర్‌లు.. ఎస్పీడీసీఎల్ కొత్త విధానం!
చుక్క రమేష్ ఆత్మహత్య
చుక్క రమేష్ ఆత్మహత్యతో ములుగు జిల్లాలో ఒక్కసారిగా వేడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీతక్క, (Seethakka)ఆమె అనుచరుడు పైడాకుల అశోక్ తీరుపై బీఆర్ఎస్ (BRS) శ్రేణులు ఎప్పటినుంచో మండిపడుతున్నారు. వారి పాలనా తీరుతో విసిగి వేసారి పోయిన బీఆర్ఎస్ శ్రేణులకు చుక్క రమేష్ ఆత్మహత్య చేసుకోవడం ఆయుధంగా మారింది. నిజానికి చుక్క రమేష్ తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనతో పలు వాట్సప్ గ్రూపులలో తన గోడును వెల్లబోసుకున్నాడు. వాట్సప్ లలో రమేష్ పెట్టె మెసేజ్ లకు కాంగ్రెస్ (Congress) నాయకులు జీర్ణించుకోలేక పోలీసులకు సమాచారం అందించి (Chukka Ramesh) చుక్కా రమేష్ కు కౌన్సిలింగ్ నిర్వహించేలా చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు గతవారం చుక్క రమేష్ ఇంటికి వెళ్లి వాట్సప్ గ్రూపులలో వివాదం చెలరేగే విధంగా మెసేజ్లు పెట్టవద్దని కౌన్సిలింగ్ నిర్వహించారు.
అనంతరం మరుసటి రోజు (Police)పోలీస్ స్టేషన్ కి రావాలని బలవంతంగా రమేష్ సెల్ఫోన్ లాక్ వెళ్లారు. దీంతో భయపడిన రమేష్ తీవ్ర మానసిక వేదనకు గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా ములుగు జిల్లాలో కలకలం రేగింది. రమేష్ మృతదేహాన్ని రహదారిపై ఉంచి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ (BRS Party)) పార్టీ శ్రేణులు రాస్తారోకో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతదేహం వద్దకు చేరుకున్న పోలీసులు రమేష్ మృతదేహాన్ని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
❄️ప్రజా నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పిలుపు
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క, ఆమె ప్రధాన అనుచరుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ రాచరిక పాలనతో విసిగి వేసారిన ప్రజలు తిరుగుబాటును ప్రదర్శిస్తున్నారు. గత 20 రోజుల క్రితం తాడువాయి మండలం కాల్వపల్లి గ్రామస్తులు సైతం అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించకుండా బిల్డింగులు, భవనాలు, (Congress Party)) కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్వయంగా (Seethakka) సీతక్కకు తమ చేతులతో ఓట్లు వేస్తే తమను ఆదుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ప్రోత్బలంతోనే పోలీసులు రమేష్ ఇంటి వద్దకు వచ్చి ఆయన సెల్ ఫోను బలవంతంగా లాక్కెళ్ళడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రమేష్ ఆత్మహత్య చేసుకున్న విషయం విధితమే.
❄️మంత్రి సీతక్క పై మావోయిస్టులు… జిల్లా అధ్యక్షుడు అశోక్ పై నాగన్న పంచిన లేఖలు కలకలం
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పై గత నెల 26వ తేదీన మావోయిస్టులు ఓ లేఖను విడుదల చేశారు. అందులో సీతక్క (Seethakka) ఆదివాసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని, ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తున్న పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వరంగల్లో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ రాజకీయ తీరుపై నాగన్న పేరిట పాంప్లెట్స్ పంచడం కలకలం రేపింది. ఓవైపు జిల్లా మంత్రిపై మరోవైపు అదే జిల్లా మంత్రి ప్రధాన అనుచరుడు పై లేఖలు వైరల్ కావడం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తీరని నష్టం జరిగినట్లుగా భావించారు.
అయితే సీతక్కకు (Seethakka) మావోయిస్టులు రాసిన లేఖ తాము రాయలేదని మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి జగన్ స్పష్టం చేశారు. అదేవిధంగా పైడాకుల అశోక్ (Ashok పై పంచిన కరపత్రాలు ఆకాశరామన్నగా పంచినట్లు తెలుస్తోంది. అయితే అటు మంత్రిపై వ్యతిరేకంగా వచ్చిన మావోయిస్టుల లేఖ, ఇటు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పై పంచిన కరపత్రాలు ఆకాశరామన్నవిగా తేలడంతో కొంత కాంగ్రెస్ పార్టీ (Congress Party)) శ్రేణులకు ఉపశమనం లభించింది. ఏదైతేనేం ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు లేఖల తో కొంత నష్టం వాటిల్లిందని చర్చ సాగడం గమనార్హం. అయితే ప్రస్తుతం మాత్రం బిఆర్ఎస్ శ్రేణులు వర్సెస్ పోలీసులు అన్నట్లుగా ములుగు జిల్లాలో పరిస్థితి ఉంది. దాదాపు జిల్లాలో అన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది.
పెద్ది సుదర్శన్ రెడ్డి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,
ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముసుగేసుకుని అరాచకమైన ముఠాలు తయారై ఇసుక దందాలు, అక్రమ వ్యాపారాలను చేస్తూ జిల్లాను నాశనం చేస్తున్నారు. ములుగు జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయకుండా అనర్హులను ఎంపిక చేయడంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పోస్టింగ్ చేయడంతో వారిపై కేసులు పెట్టడం… అర్హులైన లబ్ధిదారులకు కేటాయించకుండా వారిని మానసిక ఇబ్బందులకు గురి చేయడంతో చుక్కా రమేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరికి తెలిసిన విషయమే.
కాంగ్రెస్ అరాచకాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ములుగు జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తల రాసే జర్నలిస్టుల పైన దాడులు జరగడం దారుణం. సీతక్క కను సైగలతోనే పోలీసులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఉక్కు పాదం మోపుతున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారు. అమాయక గిరిజనులు సైతం స్వేచ్ఛగా జీవించకుండా పోలీసుల చర్యలు ఉంటున్నాయి. జిల్లా ఇన్చార్జి బడే నాగజ్యోతి ఆధ్వర్యంలో జరిగే ప్రజా నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం.పెద్ది సుదర్శన్ రెడ్డి, (Sudarshan Reddy) నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాటు వ్యాఖ్యలు చేశారు
Also Read: Artificial Intelligence: ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్‌తో కష్టాలు.. మార్ఫింగ్ వీడియోలతో మోసాలు!
❄️ప్రజలను రక్షించే పోలీసులే ప్రజలకు భక్షకులు కావొద్దు!
❄️బడే నాగజ్యోతి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు, ములుగు అసెంబ్లీ ఇన్చార్జి
ములుగు జిల్లాలో రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతోంది. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు కాంగ్రెస్ (Congress) సూచనలతో ప్రతిపక్ష నాయకుల పై చర్యలు తీసుకుంటున్నారు. పోలీసులంటే రక్షించే వారే కావాలి కానీ ప్రజలను భక్షించే వారుగా కీర్తి తెచ్చుకోవద్దు. ములుగు జిల్లాలో అరాచక పాలన సీతమ్మ (Seethakka) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. సీతమ్మ, ఆమె ప్రధాన అనుచరుడు పైడాకుల అశోక్ల అరాచకపు పాలనతో ములుగు ప్రజలు విసిగి వేసారి పోతున్నారు. న్యాయం గెలవాలి… న్యాయం కోసం ప్రతిపక్ష, అధికార పార్టీ నాయకులు పనిచేయాలి.
అక్రమ కేసులు పెట్టడం ఏంటి…?
కక్షపూరిత రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు ఆశపడితే వారిపై అక్రమ కేసులు పెట్టడం ఏంటి…? రాష్ట్రంలో ఇలాంటి పాలన సాగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా…? ములుగు లో అయితే అసాంఘిక కార్యక్రమాలకు, అక్రమ వ్యాపారాలకు, ఫోర్త్ ఎస్టేట్ గా నిలుస్తున్న మీడియాపై దాడులు చేయడం పరిపాటిగా మారుతుంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు. చుక్క రమేష్ కొంతమంది కాంగ్రెస్ నాయకులతో ప్రాణహాని ఉందని వాట్సాప్ లలో మెసేజ్లు పెట్టాడు. రమేష్ పెట్టిన వాట్సాప్ మెసేజ్ లను ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా నిగ్గు తేల్చాలి. బాధితులకు శిక్ష పడాలి అని అన్నారు.
Also Read: Fish Venkat: ఫిష్ వెంకట్‌కు రూ. 50 లక్షలు.. ప్రభాస్ నిజంగానే మహారాజు!