Fish Venkat: టాలీవుడ్‌లో కామెడీ విలన్‌గా అలరించిన ఫిష్ వెంకట్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందనే విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఆయన హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతోంది. ఆయన బతకాలంటే మాత్రం వెంటనే కిడ్నీ మార్పిడి జరగాలని, అందుకు దాదాపు రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ సూచించడంతో.. ఆ ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా వేదికగా ఎవరైనా తమకు సాయం చేయాలని కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రభాస్ వరకు చేరడంతో.. మహారాజులా ముందుకు వచ్చి, ఆ రూ. 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, దాతని చూసుకోమని చెప్పినట్లుగా.. ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి మీడియాకు తెలిపారు.
Also Read- Movie Piracy: పైరసీతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కిరణ్ అరెస్ట్.. ఒక్క ఏడాదిలో రూ. 3700 కోట్ల నష్టం
ముందుగా తన భర్త ఫిష్ వెంకట్ ఆరోగ్యం గురించి స్పందిస్తూ.. చాలా దీన స్థితిలో ఉన్నాం. పరిచయస్తులు కూడా ఎవరూ ఇటు వైపు రావడం లేదు. కనీసం పలకరించడం కూడా చేయడం లేదు. నాలుగేళ్ల క్రితం మద్యానికి బానిసైన ఆయనకు.. షుగర్, కాలు ఇన్‌ఫెక్షన్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అప్పుడు కొందరు సినీ ప్రముఖులు, దాతలు ముందుకు వచ్చి సాయం చేశారు. అప్పుడు తిప్పుకుని ప్రాణాపాయం నుంచి బయటపడినా.. ఆ తర్వాత కొన్నాళ్లకే మళ్లీ మద్యం, ధూమపానం మొదలు పెట్టారు. అదే టైమ్‌లో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తను చెడు అలవాట్లను మానేసినా, స్నేహితులు మళ్లీ ఏం కాదు అంటూ అలవాటు చేశారు. ఆయన రెండు కిడ్నీలు ఎప్పుడో పాడయ్యాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా మారింది. దయచేసి సినిమా ఇండస్ట్రీలోనీ అన్ని సంఘాల వారికి, అలాగే ప్రభుత్వాధికారులకు విన్నవించుకుంటున్నాను. మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.. అని వీడియోలో తెలిపారు. ఈ వీడియో వైరల్ అయింది.
Also Read- Mega Family: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌పై మెగా హీరోల స్పందనిదే..
తాజాగా ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు కాదు.. చాలా సంవత్సరాల క్రితమే నాన్నకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. దాదాపు నాలుగేళ్ల నుంచి ఆయనకు డయాలసిస్ జరుగుతుంది. ప్రస్తుతం నాన్న పరిస్థితి క్లిష్టంగా మారింది. ఆపరేషన్ చేసి కనీసం ఒక కిడ్నీ అయినా మార్చాలని డాక్టర్లు చెప్పారు. అందుకు రూ. 50 లక్షలు ఖర్చు అవుతుందని అన్నారు. అంత డబ్బు మా దగ్గర లేదు. దయచేసి ఎవరైనా హెల్ప్ చేయండని స్రవంతి కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. మళ్లీ ఆమె మాట్లాడుతున్న వీడియోనే ఒకటి బయటికి వచ్చింది. ఈ వీడియోలో మా నాన్న ఆరోగ్య పరిస్థితిపై సాయం చేయాలని వేడుకుంటున్న వీడియో చూసిన ప్రభాస్ సార్.. తన అసిస్టెంట్‌తో కాల్ చేయించారు. కిడ్నీ ఇచ్చే దాతని చూసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన అమౌంట్‌ని సార్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. కాకపోతే ఇప్పటి వరకు దాత ఎవరూ దొరకలేదు. మా కుటుంబంలోని వారితో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవడం లేదు. నాన్న బ్రదర్స్ ఉన్నారు కానీ వారి హెల్త్ కూడా సరిగా లేదు. ప్రస్తుతం దాత కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇక ఈ వీడియో బయటికి వచ్చినప్పటి నుంచి ప్రభాస్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు