Piracy Raja Kiran Kumar Arrested
ఎంటర్‌టైన్మెంట్

Movie Piracy: పైరసీతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కిరణ్ అరెస్ట్.. ఒక్క ఏడాదిలో రూ. 3700 కోట్ల నష్టం

Movie Piracy: వృత్తి ఎయిర్ కండీషన్​ టెక్నీషియన్. ప్రవృత్తి సినిమాల పైరసీ. ఏ కొత్త సినిమా రిలీజైనా మొదటి రోజే వాటిని పైరసీ చేసి హెచ్‌డి ప్రింట్లుగా మార్చి పైరసీ మాఫియాకు అమ్ముతూ వస్తున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నలభైకి పైగా పెద్ద సినిమాలను పైరసీ చేశాడు. క్రిప్టో కరెన్సీ రూపంలో లక్షల రూపాయలు కూడబెట్టుకున్నాడు. ఒక్క ఏడాదిలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుమారు రూ. 3700 కోట్ల నష్టానికి కారణమయ్యాడు. తెలుగు ఫిలిం ఛాంబర్​ ఆఫ్ కామర్స్​ యాంటీ వీడియో పైరసీ సెల్​ ప్రతినిధి మణీంద్ర బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన హైదరాబాద్​ సైబర్ క్రైం పోలీసులు ఎట్టకేలకు నిందితున్ని అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీపీ దారా కవిత తెలిపిన ప్రకారం.. కిరణ్ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read- Mega Family: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌పై మెగా హీరోల స్పందనిదే..

‘‘తూర్పు గోదావరి జిల్లాకు చెంది ప్రస్తుతం వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో నివాసముంటున్న జన కిరణ్​ కుమార్​ (29) ఏసీ టెక్నీషియన్​. కాగా, తేలికగా డబ్బు సంపాదించేందుకు సినిమాలను పైరసీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆన్​ లైన్​‌లో టిక్కెట్లు బుక్ చేసుకుని కొత్త సినిమా రిలీజ్ అయిన రోజునే కిరణ్​ కుమార్ థియేటర్‌కు వెళ్లేవాడు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న క్యామ్​ కార్డ్​ ద్వారా సినిమాలను రికార్డు చేసేవాడు. అనంతరం వాటిని హెచ్‌​డీ ప్రింట్లుగా మార్చేవాడు. ఒక్కో సినిమాను పైరసీ మాఫియాకు 300 నుంచి 400 అమెరికన్ డాలర్లకు అమ్మేవాడు. దీని కోసం ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాలను అప్‌లోడ్ చేసే వన్​ తమిళ్​ ఎమ్వీ అనే సంస్థతో ఈ మెయిల్ ద్వారా మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మే 9న రిలీజైన ‘సింగిల్’ అనే సినిమాను ఈ విధంగానే పైరసీ చేసి అమ్మేసుకున్నాడు. దీనిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్​ కామర్స్​ యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రతినిధి మణీంద్ర బాబు సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమిళ్ బ్లాస్టర్స్​, మూవీజ్ రూల్జ్, తమిళ్ ఎంవీతోపాటు వేర్వేరు వెబ్ సైట్లలో సినిమాను అప్‌లోడ్ చేసినట్టుగా తెలిపారు.

Also Read- Dil Raju: పైరసీపై కఠిన చర్యలకు ఎఫ్‌డీసీ ముందడుగు.. సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్ అరెస్ట్

ఈ మేరకు కేసులు నమోదు చేసిన సీఐ నరేశ్​, ఎస్​ఐ మన్మోహన్​ గౌడ్​, హెడ్​ కానిస్టేబుళ్లు మహ్మద్​ ఫిరోజ్​, రాకేశ్ సాగర్, తిరుమలేశ్‌తో కలిసి విచారణ జరిపి నిందితుడైన కిరణ్​ కుమార్‌ను అరెస్ట్​ చేశారు. విచారణలో ఇప్పటి వరకు 65కు పైగా సినిమాలను పైరసీ చేసి అమ్ముకున్నట్టుగా నిందితుడు వెల్లడించాడు. వీటిలో తెలుగు, తమిళ్, హిందీ సినిమాలు ఉన్నట్టుగా చెప్పాడు. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘తండేల్’​తో పాటు ‘సింగిల్​, కిస్మత్, రొమాంటిక్​, గేమ్​ ఆన్​, పెళ్లి కాని ప్రసాద్​, రాజధాని ఫైల్స్​, ప్రతీరోజు పండుగే’ తదితర చిత్రాలను పైరసీ చేసినట్టుగా తెలిపాడు. ఒక్కో సినిమాకు 300 నుంచి 400 అమెరికన్​ డాలర్లను క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకున్నట్టుగా వెల్లడించాడు. బిట్​ కాయిన్స్​ రూపంలో కూడా కొన్నిసార్లు డబ్బు తీసుకున్నట్టు చెప్పాడు. అనంతరం జూ పే ద్వారా దీనిని భారత కరెన్సీలోకి మార్చుకున్నట్టుగా వెల్లడించాడు. ఈ క్రమంలో పోలీసులు నిందితుని నుంచి పలు సినిమాల ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై ఐటీ యాక్ట్ సెక్షన్​ 66(సీ), 66(ఈ), బీఎన్​ఎస్​ చట్టం సెక్షన్​ 318(4) రెడ్ విత్ 3(5), 338, కాపీరైట్ యాక్ట్ సెక్షన్​ 63, 65, సినిమాటోగ్రఫీ యాక్ట్ 6–ఏఏ, 6ఏబీ, 7(1ఏ) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. నిందితుని నుంచి రెండు సెల్ ఫోన్లను సీజ్​ చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు