Bengaluru Crime (Image Source: Twitter)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Bengaluru Crime: భార్యను నేలపైకి తోసి.. పీకపై కాలుతో తొక్కి.. హత్య చేసిన భర్త!

Bengaluru Crime: కలకాలం తోడు నీడగా ఉంటామని వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న దంపతులు.. ఒకరిపట్ల ఒకరు బద్దశత్రువులుగా మారుతున్నారు. వివాహేతర బంధాలు, క్షణికావేశాలతో జీవిత భాగస్వామిని అతి దారుణంగా చంపేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. తాజాగా బెంగళూరు (Bengaluru)లోనూ ఈ తరహా ఘోరం జరిగింది. ఓ భర్త కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్య చేశాడు.

వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటక (Karnataka)లోని శ్రీనివాసపుర్ (Srinivaspur)కు చెందిన హరీశ్ కుమార్ (Harish Kumar), పద్మజ (Padmaja) భార్య భర్తలు. బీటెక్ (Bachelor of Engineering) పూర్తి చేసిన ఇరువురు.. ఉద్యోగాల రిత్యా బెంగళూరులో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే తాజాగా హరీశ్, పద్మజల మధ్య ఓ విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన హరీశ్.. పద్మజను ఒక్కసారిగా నేలపైకి తోశాడు. అనంతరం ఆమెను చితకబాదాడు. అంతటితో ఆగకుండా పద్మజ గొంతుపై కాలు వేసి.. చనిపోయేవరకూ బలంగా తొక్కాడు. దీంతో పద్మజ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Also Read: Youtuber Ali Aalyan Iqbal: లద్దాఖ్‌లో అతి చేసిన యూట్యూబర్.. రంగంలోకి పోలీసులు.. ఇక మూడినట్లే!

హరీశ్ అరెస్ట్
పద్మజ హత్య గురించి సమాచారం అందుకున్న బొమ్మనహళ్లి పోలీసులు (Bommanahalli Police).. భర్త హరీశ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే భార్య భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి వీరిద్దరి మధ్య మరోమారు గొడవ జరిగినట్లు చెప్పారు. అది మరింత తీవ్ర రూపం దాల్చడంతో హరీశ్.. తన భార్యను హత్య చేసినట్లు స్పష్టం చేశారు. అతడిపై కేసు నమోదు చేశామని.. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలను అతడి నుంచి రాబడుతున్నట్లు బొమ్మనహళ్లి పోలీసులు వివరించారు.

Also Read This: WhatsApp – AI: వాట్సప్‌లో గమ్మత్తైన ఏఐ ఫీచర్స్.. ఇలా ట్రై చేయండి.. థ్రిల్ అవుతారు!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!