Mobile Recharge: ఒకప్పుడు ఎవరైనా ఫోన్ కొనుక్కుకుంటే ఆశ్చర్యంగా చూసే వాళ్ళు. కానీ, ఇప్పుడు ఫోన్ లేని వాళ్లే లేరు. రోజు రోజుకి మొబైల్ యూజర్లు విపరీతంగా పెరిగిపోతున్నారు. అయితే, తాజాగా టెలికాం సంస్థలు తీసుకున్న నిర్ణయానికి సామాన్యులు షాక్ అవుతున్నారు. టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను మరోసారి పెంచే సూచనలు ఇవ్వడంతో, సామాన్య వినియోగదారులపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న మధ్యతరగతి, కార్మిక వర్గాల ప్రజలకు, మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు నెలవారీ ఖర్చులపై నేరుగా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు, గ్రామీణ ప్రాంత వినియోగదారులు ఈ టారిఫ్ పెంపుతో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.
Also Read: Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ ఆరోజే విడుదల.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తాడట!
ప్రముఖ టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను 10 నుంచి 12 శాతం వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 5G సేవల విస్తరణ కారణంగా భారీ పెట్టుబడుల ఒత్తిడి కంపెనీలపై ఉండటంతో, ధరలు పెంచడం సులభమైన మార్గంగా భావిస్తున్నాయి.
Also Read: Tabu: 16ఏళ్ళ వయసులో ఆ హీరో టబుతో అలాంటి పని చేశాడా.. అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదా?
అయితే, ఈసారి బేసిక్ ప్లాన్‌లకు బదులు మిడ్-రేంజ్, హై-ఎండ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు అవకాశాలు ఉన్నాయి. అంటే, ఎక్కువ డేటా, అపరిమిత కాల్స్ వంటి సౌలభ్యాలున్న ప్లాన్‌ల వినియోగదారులపై ఈ ధరల పెంపు ఎక్కువ భారం వేసే అవకాశం ఉంది.
Also Read: Naga Chaitanya: చైతూ అప్పటి వీడియో ఇప్పుడెందుకు వైరలవుతోంది.. సమంతే కారణమా?
గతంలో ధరలు పెరిగిన నేపథ్యంలో, మరోసారి టారిఫ్ పెంపు సామాన్య ప్రజలకు ఆర్థిక ఒత్తిడిగా మారనుంది. ప్రత్యేకించి, విద్యార్థులు, ఉద్యోగస్తులు, డేటాను తరచూ ఉపయోగించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై టెలికాం కంపెనీల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ, త్వరలోనే దీని గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నరు.
Also Read: Fish: చేపలు ఎన్ని రకాలు.. ఎలాంటివి తింటే ఆరోగ్యానికి మంచిది.. అసలెందుకు తినాలి?