American Hero: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. అకస్మికంగా పోటెత్తిన వరదల్లో పదుల సంఖ్యలో ప్రజలు కొట్టుకుపోయారు. వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు.. పలువురిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాయి. ఇదిలా ఉంటే సహాయక చర్యల్లో భాగమైన కోస్ట్ గార్డ్ స్కాట్ రస్కీన్ పై ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నారు. ‘అమెరికన్ హీరో’ (American Hero) అంటూ అతడ్ని ఆకాశానికెత్తేస్తున్నారు. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
164 మందిని కాపాడిన స్కాట్
న్యూజెర్సీకి చెందిన స్కాట్ రస్కాన్ (26).. అమెరికన్ కోస్ట్ గార్డ్ లో స్విమ్మర్ గా పనిచేస్తున్నాడు. జులై 4న కొత్తగా విధుల్లో చేరిన అతడు.. అప్పటివరకూ కోస్ట్ గార్డ్ మిషన్ లోనూ భాగం కాలేదు. అయితే తాజాగా టెక్సాస్ రాష్ట్రంలో సంభవించిన అకస్మిర వరదల నేపథ్యంలో యూఎస్ కోస్ట్ గార్డ్ తరపున స్కాట్ రస్కాన్ (Scott Ruskan) సహాయక చర్యల్లో పాల్గొన్నాడు. తన తొలి మిషన్ లోనే ప్రాణాలకు తెగించి పలువురిని రక్షించాడు. ప్రవాహంలో చిక్కుకున్న 164 మందిని స్కాట్ కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ తెలిపారు. ఎక్స్ వేదికగా అతడి గురించి ప్రశంసిస్తూ ప్రశంసలు కురిపించారు.
United States Coast Guard Rescue Swimmer and Petty Officer Scott Ruskin, directly saved an astonishing 165 victims in the devastating flooding in central Texas.
This was the first rescue mission of his career and he was the only triage coordinator at the scene.
Scott Ruskin is…
— Secretary Kristi Noem (@Sec_Noem) July 6, 2025
12 హెలికాఫ్టర్లతో సహాయక చర్యలు
సెంట్రల్ టెక్సాస్ లో సంభవించిన వరదల కారణంగా దాదాపు 800 మందికి పైగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. ముఖ్యంగా గ్వాలాలుపే నదికి వెంబడి ఉన్న క్రైస్తవ బాలికల వేసవి శిబిరం క్యాంప్ తీవ్రంగా ప్రభావితమైంది. నది ప్రవాహం క్యాంప్ ను చుట్టుముట్టడంతో 20 మందికి పైగా బాలికలు ప్రవాహంలో కొట్టుకుపోయారు. దీంతో రంగంలోకి దిగిన అమెరికన్ కోస్ట్ గార్డ్.. 12 హెలికాఫ్టర్లతో సహాయక చర్యలు ప్రారంభించింది. అందులో రెస్క్యూ టీమ్ లో భాగంగా ఉన్న స్విమ్మర్ స్కాట్ రస్కాన్.. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారిని, చెట్ల కొమ్మలు పట్టుకొని ప్రమాదకర స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తించి రక్షించాడు. అలా అవిశ్రాంతంగా పని చేసి ఏకంగా 164 మందిని అతడు కాపాడాడు.
Coast Guard Hero Scott Ruskan, 26, Saves 165 Lives in Texas Flash Floods
I hope he is recognized for his incredible bravery pic.twitter.com/V4iCGScVZB
— TaraBull (@TaraBull808) July 7, 2025
Also Read: Chatgpt: చాట్ జీపీటీ సాయంతో 18 కేజీలు తగ్గిన యువతి.. ఏందయ్యా ఈ అద్భుతం!
అమెరికన్స్ ఏమంటున్నారంటే!
స్కాట్ రస్కాన్ చూపిన తెగువపై అమెరికన్లు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడొక రియల్ హీరో (Real Hero) అంటూ ఆకాశానికెత్తుకున్నారు. తాము చూసిన నిజమైన సూపర్ హీరో అతడెనంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. రెస్క్యూ సమయంలో అతడు చూపిన తెగువ, ధైర్యం, సాహసం.. ఎంతో ఆదర్శనీయమని అంటున్నారు. ప్రాణ నష్టాన్ని నివారించడంలో అతడు కీలక పాత్ర పోషించాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. మెుత్తంగా రియల్ హీరో అంటూ అమెరికన్స్ చేస్తున్న కామెంట్స్ తో.. అతడి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది.