Marriage Fund
బిజినెస్, లేటెస్ట్ న్యూస్

Personal Finance: పెళ్లికి డబ్బులు కావాలా.. ఇలా చేయండి తిరుగుండదు!

Personal Finance: ఈ రోజుల్లో పెళ్లి చేయడమంటే అంత ఈజీ కాదు. ఖర్చులు తడిసి మోపెడు (Personal Finance) అవుతున్నాయి. పెళ్లి వస్త్రాల నుంచి భోజనాలు, కల్యాణ మంటపాలు, కెమెరామెన్ వరకు డబ్బు కుమ్మరిస్తే తప్ప ఏ పనులూ జరగడం లేదు. ఎలాంటి వారికైనా కనీసం రూ.5 లక్షల నుంచి స్థోమత ఉన్నవారు కోట్లు కూడా ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే, సరైన ఆర్థిక ప్రణాళికలు లేకుంటే ఖర్చులు కట్టుతప్పి సమస్యల పాలవ్వాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే, చక్కగా ప్లానింగ్ చేసుకుంటే ఈ ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడవచ్చు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా ఇంట్లో పెద్దవాళ్లు నిశ్చింతగా, ధైర్యంగా ఉండవచ్చు. కల్యాణ్ మంటపాల నుంచి డిజైనర్ దుస్తుల వరకు అన్నీ స్థోమతకు తగ్గట్టుగా జరుపుకోవచ్చు.

ఒక వ్యక్తి జీవితంలో ఎంతో విశేషమైన పెళ్లి కోసం ఒక సంవత్సరం వంటి స్వల్పకాలిక ఫైనాన్సియల్ ప్లానింగ్స్ కూడా చేసుకోవచ్చు. నెలవారీ పెట్టుబడులతో కూడా గణనీయ మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవచ్చు. కలల వివాహాన్ని ప్లాన్ చేసుకోవడంలో ఉపయోగపడే కొన్ని ఫైనాన్సియల్ ప్లానింగ్స్‌ను మీరు కూడా గమనించండి మరి.

వార్షిక ఆర్థిక ప్రణాళిక ఇదే
ప్రస్తుతమున్న పొదుపు ఆధారంగా పెళ్లికి ఎంత ఖర్చు పెట్టగలరనే దానిపై ముందుగానే ఒక అంచనాకు రావాలి. దాని ఆధారంగా మొత్తం బడ్జెట్‌ను డిసైడ్ చేసుకోవాలి. కల్యాణ మంటపం, క్యాటరింగ్, పెళ్లి దుస్తులు, ఆభరణాలు, అతిథులకు గిఫ్ట్‌లు, ఫోటోగ్రఫీ వంటి ప్రధాన ఖర్చులను దేనికది విభజించుకోవాలి. ఖర్చులన్నీ లెక్కకూడి అవసరమైతే బ్యాంక్ అకౌంట్‌ కూడా తెరవవచ్చు. ఓపెన్ చేసిన అకౌంట్‌లో నెలవారీ పొదుపు డబ్బును జమ చేస్తుండాలి. అంచనాలు కరెక్టుగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు తెలిసినవారి పెళ్లిలో ఏర్పాట్లను పరిశీలింవచ్చు కూడా. చివరి నిమిషంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా అంచనాలకు తగ్గట్టు డబ్బును సిద్ధం చేసుకోవాలి. అదనపు ఖర్చులను కూడా దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడాలి.

Read Also- Viral News: డ్యూటీ చేయకుండానే 12 ఏళ్లుగా కానిస్టేబుల్‌కు శాలరీ

పెళ్లి నిధి కోసం అందుబాటులో పెట్టుబడి ఆప్షన్లు ఇవే
1. మ్యూచువల్ ఫండ్పం
సాధారణంగా ఒక ఏడాది కంటే తక్కువ కాలపరిమితితో డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్‌లను ‘షార్ట్ టెర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్’ అని పిలుస్తారు. కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, డిపాజిట్ సర్టిఫికెట్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ డెట్ ఫండ్‌లు సాధారణంగా ఒక ఏడాది కాలవ్యవధిలో 9-10 శాతం వరకు సగటు రాబడిని అందిస్తాయి.

2. ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ఒక ఏడాది వంటి స్వల్ప కాలానికి బ్యాంకులో ఏకమొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయవచ్చు. బ్యాంకును బట్టి, కస్టమర్ వయసును బట్టి సాధారణంగా 6 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

3. రిక్కరింగ్ డిపాజిట్లు
రిక్కరింగ్ డిపాజిట్ల ద్వారా ప్రతి నెలా ఒక చిన్న మొత్తంలో పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. ముందుగా నిర్ణయించిన రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది. సాధారణంగా ఒక ఏడాది రిక్కరింగ్ డిపాజిట్ ప్లాన్స్ సగటున 6-7 శాతం వరకు వడ్డీని సమకూర్చుతాయి.

4. సిప్‌లు
మ్యూచువల్ ఫండ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIPs) సాధారణంగా అయితే మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతుంటాయి. అయితే, మార్కెట్‌లో అస్థిరతలకు గురికాకుండానే అధిక రాబడి ఇచ్చే విధంగా పెట్టుబడి పెట్టేందుకు కూడా అవకాశం ఉంటుంది. రిస్క్‌ను బట్టి విస్తృత శ్రేణి ప్లానింగ్స్ అందుబాటులో ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్, మల్టీ-అసెట్, ఫ్లెక్సిక్యాప్ ఫండ్‌లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ స్కీమ్స్‌లో మితం నుంచి అధిక రిస్క్‌ ఉంటుంది. సాధారణంగా అయితే ఒక ఏడాది వ్యవధికి 12-14 శాతం వరకు సగటు రాబడిని అందిస్తాయి.

Read Also- Suspense Case: వరుసగా క్యాబ్‌ డ్రైవర్ల మిస్సింగ్ కేసులో సంచలనం

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!