Allu Arjun Voted Filmnagar
Cinema

Hyderabad: ‘పుష్ప’ను ఇరికించేశారు

Allu Arjun voted Film Nagar, Jublee Hills, talk about politics:
హైదరాబాద్ ఫిలింనగర్ లో ని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసి వస్తున్న బన్నీని మీడియా చుట్టుముట్టింది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ..అందరూ తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరారు. అయితే విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు బన్నీ. తాను ఏ రాజకీయ పార్టీకి చెందినవాడికి కాదని…రాజకీయాలపై ప్రస్తుతానికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని అన్నారు. నంధ్యాల ఘటనపై వివరణ ఇచ్చారు బన్నీ. ఇటీవల బన్నీ ఏపీలోని నంద్యాల పట్టణంలో ఉన్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లారు. శిల్పా రవిచంద్ర నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కూటమి తరపున జనసేన తరపున పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం బరిలో ఉన్నారు. సొంత మామయ్య పవన్ తరపున ప్రచారం చెయ్యకుండా వైసీపీ నేతకు సపోర్ట్ చేసే విషయంపై క్లారిటీ ఇచ్చారు బన్నీ. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని సినీ నటుడు అల్లు అర్జున్‌ అన్నారు. నంద్యాలలో బన్నీ పర్యటనకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారి ముందస్తు అనుమతులు ఏవీ ఇవ్వలేదు. నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి ఇటీవల ఉదయం అల్పాహారానికి అల్లుఅర్జున్‌ వచ్చారు. వైసీపీ శ్రేణులు వ్యూహాత్మకంగా పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని సినీనటుడు అల్లుఅర్జున్‌, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎన్నికల అధికారి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పట్టణంలో 30 పోలీసు యాక్టు, 114 సెక్షన్‌ అమల్లో ఉన్నా.. ఎన్నికల అధికారి అనుమతి లేకుండా శిల్పా చంద్రకిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్‌ వచ్చారని.. అక్కడ వేలమంది గుమిగూడారని చెప్పారు.

నా అనుకునేవాళ్లకు నా మద్దతుంటుంది

అయితే తనకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదని. అన్ని పార్టీలు ఒక్కటే అన్నారు బన్నీ. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుందన్నారు. మా మావయ్య పవన్‌కల్యాణ్‌కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో రవిగారికి కూడా అలాగే మద్దతు తెలిపా. ఒకవేళ భవిష్యత్‌లో మా మావయ్య చంద్రశేఖర్‌గారు, బన్నివాస్‌ ఇలా వ్యక్తిగతంగా నాకు దగ్గరైన వ్యక్తులెవరికైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇస్తా. శిల్పా రవి 15ఏళ్లుగా నాకు మిత్రుడు. బ్రదర్‌ మీరెప్పుడైనా రాజకీయాల్లోకి వస్తే, మీ ఊరు వచ్చి సపోర్ట్‌ చేస్తా అని మాటిచ్చాను. 2019లో ఆయన రాజకీయాల్లోకి వచ్చాక వెళ్లి కలవలేకపోయాను. ఇచ్చిన నిలబెట్టుకునేందుకు ఒక్కసారైనా కనపడాలని నా మనసులో ఉంది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి, నేనే ఫోన్‌ చేసి వస్తానని చెప్పాను. అందుకే నా భార్యతో కలిసి నంద్యాల వెళ్లాను. వ్యక్తిగతంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేశాను. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు బన్నీ.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!