king nagarjuna duplicate in pakistan
Cinema

Pak Nagarjuna : పాకిస్థాన్‌లో లక్షలు సంపాదిస్తున్న నాగార్జున, ఎందుకంటే..?

King Nagarjuna Who is Earning Lakhs In Pakistan, Because : ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు కదా.. ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే.. కొందరు వ్యక్తులిని చూస్తుంటే మాత్రం అది నిజం అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న ఓ పాకిస్థాన్ వ్యక్తిని చూస్తుంటే ఇది ముమ్మాటికి నిజమనే అనిపిస్తుంది. ఇందుకు ఓ రీజన్ ఉంది. ఎందుకంటే పాకిస్థాన్‌లోని ఓ వ్యక్తి అచ్చం హీరో నాగార్జునలాగా ఉండటమే అందుకు కారణం. అంతేకాదు ఈ వ్యక్తి నెలకు లక్షలు సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

2019 సంవత్సరం నుండి టిక్‌టాక్‌లు చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు పాకిస్థాన్‌కి చెందిన జైన్ అక్మల్ ఖాన్ షికారీ మాస్ అనే వ్యక్తి. ఒకానొక సందర్భంలో తాను టాలీవుడ్ అగ్ర కథానాయకుడు కింగ్‌ నాగార్జునలా ఉన్నావని తనకు చెప్పారట. ఇంకేముంది మనోడు నాగార్జున గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు. నాగార్జున గురించి తెలుసుకుని.. అతడిలా మారాలనుకున్నాడు. నాగార్జునలా మారి షార్ట్ వీడియోస్ చేశాడు. ఇప్పుడు మాత్రం ఫుడ్ వ్లాగింగ్ చేస్తున్నాడు.

Read More: ఘనంగా 96వ ఆస్కార్ అవార్డ్స్, విజేతలు వీళ్లే.

పాకిస్థాన్‌లో ఫుడ్ వ్లాగర్‌గా ఫేమ్‌ తెచ్చుకున్న ఇతడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తాను నాగార్జున పోలికలతో ఉండటం నిజంగా నాకు బాగా కలిసి వస్తోందని, పుడ్ వీడియోలు చేసుకుంటూ నెలకు రూ. 4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Read More: చీరకట్టులో కుర్రకారు మతిపోగొడుతున్న జాన్వీకపూర్

ప్రస్తుతం తన లైఫ్ సాఫీగా సాగుతోందంటూ తెలిపాడు. ఏదేమైనా నాగార్జున పోలికలు ఉండటం నిజంగా మనోడికి కలిసొచ్చినట్లు అయింది. ఓ పక్క.. ఫుడ్ వీడియోలు, మరో పక్క.. నాగార్జున పోలికలు రెండు కూడా ప్లస్ అయ్యాయి. దీంతో మనోడి లైఫ్ మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా కొనసాగుతోంది.

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?