Texas Floods: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వరదలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా టెక్సాస్ హిల్ కంట్రీ (Texas Hill Country) రీజియన్ లో అకస్మిక వరదలు సంభవించాయి. దీంతో 24 మంది ప్రాణాలు కోల్పోగా.. 25 మందికి పైగా నీటిలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారిలో చిన్నారులే అధికంగా ఉన్నట్లు టెక్సాస్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. వారి ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను తీవ్రతరం చేసినట్లు స్పష్టం చేశాయి.
క్రిస్టియన్ క్యాంప్ గల్లంతు
టెక్సాస్ హిల్ కంట్రీలోని రీజియన్ లోని గ్వాడాలుపే నది (Guadalupe River) వెంబడి కుండపోత వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా నది ఉప్పొంగి.. పరివాహక ప్రాంతాలను ముంచెత్తింది. పదులో సంఖ్యలో ప్రజలు కొట్టుకుపోగా వారిలో 24 మంది మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గ్వాడాలుపే నది ఒడ్డున ఏర్పాటు చేసిన బాలికల క్రిస్టియన్ సమ్మర్ క్యాంప్.. వరదలకు తీవ్రంగా ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. క్రిస్టియన్ క్యాంప్ లోని 23 – 25 మంది బాలికల ఆచూకి తెలియకుండా పోయిందని పేర్కొన్నారు. దీంతో బాలికల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆచూకి తెలియజేయాలంటూ సోషల్ మీడియాలో వారి ఫొటోలు చేరవేస్తున్నారు.
PLEASE PRAY For More Miracles In Texas.
Many Little Girls Still Missing From Camp Mystic Where Flooding Inundated The Girls Camp Over Just 45 Minutes…
At Least 13 Little Girls Already Confirmed Dead.
20+ Still Missing.
Search & Rescue Ongoing! pic.twitter.com/n43mMcNCEv— John Basham (@JohnBasham) July 5, 2025
ప్రమాదంలో 200 మంది
అకస్మిక వరదలపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ (Greg Abbott) స్పందించారు. వరదలతో ప్రభావితమైన కెర్ విల్లే, ఇంగ్రామ్, హంట్ సహా హిల్ కంట్రీ కమ్మూనిటీలకు అన్ని విధాలుగా సహాయక చర్యలు అందిస్తున్నట్లు చెప్పారు. కాగా గ్వాడాలుపే నది ఉప్పొంగడంతో.. సమీపంలోని నివాసాలు నీట మునిగాయి. దీంతో 200 మందికి పైగా ప్రజలు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఇప్పటికే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. పడవలు, హెలికాఫ్టర్ల సాయంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
Also Read: SSMB29: మహేష్ రాజమౌళి సినిమాపై.. సింహం, పులి సీరియస్ డిస్కషన్.. వీడియో చూస్తే కడుపు చెక్కలే!
25 సెం.మీ వర్షపాతం
ఇదిలా ఉంటే గురువారం సాయంత్రమే టెక్సాస్ లో వరద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలోనే గంటల వ్యవధిలో 10 అంగుళాలు (25 సెం.మీ) కంటే ఎక్కువ వర్ష పాతం కురిసిందని అధికారులు చెబుతున్నారు. దీంతో నది వెంబడి అకస్మిక వరదలు సంభవించి.. కెర్ కౌంటీలోని కమ్యూనిటీలు నీటమునిగాయని వివరించారు. ఉదృతంగా ప్రవహిస్తున్న గ్వాడాలుపే వైపునకు ప్రజలెవరు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. వరదలు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో టెక్సాస్ హిల్ కంట్రీని తాకిన అత్యంత దారుణమైన ప్రకృతి విపత్తుగా ప్రజలు.. ప్రస్తుత వరదలను అభివర్ణిస్తున్నారు. తరానికి ఒకసారి వచ్చే ఘటనగా పేర్కొంటున్నారు.