Samarlakota Crime: ప్రేమ, వివాహేతర సంబంధాల కారణంగా మనుషులు క్రూరంగా మారుతున్నారు. అడ్డొచ్చిన వారిని ముందు వెనకగా ఆలోచించకుండా తెగ నరుకుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఓ దారుణం చోటుచేసుకుంది. తన చెల్లిని ప్రేమించాడన్న కోపం.. ఓ యువకుడ్ని దారుణంగా హత్య చేశారు. తల నేలకు కోట్టి గొంతు నులిమి ప్రేమికుడి ప్రాణాలను యువతి అన్న తీసేశాడు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలన రేపుతోంది.
అసలేం జరిగిందంటే..
కాకినాడ జిల్లా సామర్ల కోట మండలం బ్రహ్మానందపురం గ్రామంలో నొక్కు కిరణ్ కార్తిక్ అనే యువకుడి హత్య తీవ్ర సంచలనం రేపుతోంది. గ్రామానికి చెందిన యువతిని సామర్లకోట మండలం వేమవరం గ్రామానికి కార్తిక్ ప్రేమించాడు. కొద్ది కాలంగా ఆమెతో లవ్ ట్రాక్ నడుపుతూ వచ్చాడు. ఇది తెలుసుకున్న యువతి అన్న కృష్ణ ప్రసాద్.. కార్తిక్ పై పగ పెంచుకున్నాడు. తన చెల్లింతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న కార్తిక్ ను ఎలాగైన తుది ముట్టించాలని నిర్ణయించుకున్నాడు.
పార్టీ ఇస్తానని పిలిచి
అయితే అప్పటికే కార్తిక్ తో యువతి అన్నకు పరిచయం ఉండటంతో.. జూన్ 24న పార్టీ ఇస్తానని కృష్ణ ప్రసాద్ ఆహ్వానించాడు. కార్తిక్ చెప్పిన స్థలానికి వెళ్లగా.. చెల్లితో ప్రేమ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన చెల్లితో ఫోన్ మాట్లాడొద్దని కృష్ణ ప్రసాద్.. కార్తిక్ ను వారించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. తీవ్ర కోపోద్రిక్తుడైన కృష్ణప్రసాద్.. కార్తిక్ ను కార్తిక్ తలను నేలకేసి కొట్టాడు. ఆపై గొంతునులిమి హత్య చేశాడు. తర్వాత శవాన్ని అక్కడే పాతిపెట్టి పరారయ్యాడు.
మెుబైల్ ఆధారంగా..
కుమారుడు కనిపించకపోవడంతో ఈ నెల 27న కార్తిక్ తండ్రి వెంకట రమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడ్రోజులుగా తన బిడ్డ ఆచూకీ తెలియడం లేదంటూ పోలీసులకు తెలియజేశాడు. కార్తిక్ మెుబైల్ కాల్స్, సిగ్నల్స్ ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు. అంతకుముందు స్థానిక వీఆర్ఓ వద్దకు వెళ్లి కార్తిక్ ను హత్య చేసినట్లు కృష్ణప్రసాద్ అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పాతి పెట్టిన కార్తిక్ శవాన్ని వెలికితీశారు.
Also Read: Hyderabad Water Board: జలమండలి స్పెషల్ ఫోకస్.. నీటి చౌర్యం మీటర్ల ట్యాంపరింగ్‌లకు చెక్ !
కఠిన చర్యలకు డిమాండ్
అయితే హత్య జరిగి 10 రోజులు కావడంతో కార్తిక్ మృతదేహాం కుళ్లిపోయింది. దీంతో అక్కడే వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం కార్తిక్ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. తమ కుమారుడి హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి వెంకట రమణ, తల్లి స్వరూప డిమాండ్ చేస్తున్నారు. హత్యారోపణల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. కృష్ణ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. మెుత్తంగా కార్తిక్ హత్య ఘటన సామర్ల కోట మండలం తీవ్ర చర్చకు దారి తీసింది.