MP Bandi Sanjay (imagecredit:twitter)
తెలంగాణ

MP Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని విద్యార్థులకు గుడ్ న్యూస్!

MP Bandi Sanjay: ఈనెల 11న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) పుట్టిన రోజును పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్ స్కూళ్లలో చదివే టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఆయన సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. తన పార్లమెంట్ పరిధిలోని జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్(Karimnagar) జిల్లాలో పదో తరగతి చదువుకునే బాలబాలికలు 3096 మంది ఉన్నారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3841 మంది, జగిత్యాల జిల్లాలో 1137 మంది, సిద్దిపేటలో 783 మంది, హన్మకొండ జిల్లాలో 491 మంది వెరసి 9,348 మంది బాలబాలికలు టెన్త్ క్లాస్ అభ్యసిస్తున్నారు. అలాగే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. ఒక్కో డివిజన్ కు 50 చొప్పున సైకిళ్ల(Bicycle)ను పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు ఒక్కో మండలానికి వంద చొప్పున సైకిళ్లను అదనంగా పంపిణీ చేయనున్నారు.

20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ

హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీల పరిధిలో ఒక్కో వార్డుకు 50 చొప్పున సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఇక గ్రామపంచాయతీల వారీగా 10 నుంచి 25 సైకిళ్ల చొప్పున అందించనున్నారు. వెరసి తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 20 వేల సైకిళ్లను దశలవారీగా పంపిణీ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు సైకిళ్ల తయారీలో పేరుగాంచిన ప్రముఖ సంస్థకు నెల రోజుల క్రితమే ఆర్డర్ ఇచ్చినట్లు తెలిసింది.

ఇప్పటికే 5 వేల సైకిళ్లు కరీంనగర్‌కు చేరుకున్నాయని, తొలి దశగా వీటిని ఈ నెల 8 లేదా 9వ తేదీన పంపిణీ చేసేందుకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. మిగిలిన సైకిళ్లు కూడా వచ్చిన వెంటనే అసెంబ్లీ నియోజకవర్గాల, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇక సైకిళ్ల ఖర్చు వివరాలకు వస్తే, ఒక్కో సైకిల్ ను రూ.5,300 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ రాడ్ కు ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇంకోవైపు బండి సంజయ్ ఫోటోను ముద్రిస్తున్నారు.

Also Read: CM Revanth Reddy: పేదల వైద్యం కోసం ఏడాదిన్నరలో రూ.1400 కోట్లు!

బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు

ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్లే ఉంటారనే విషయం తెలిసిందే. తమ ఇంటి నుంచి స్కూల్ వరకు వెళ్లడానికి తగిన రవాణా సౌకర్యాల్లేక, ఆటోలు, బస్సులు వెళ్లే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా టెన్త్ క్లాస్ విషయానికొచ్చే సరికి స్కూల్ వేళలు ముగిసిన తరువాత స్పెషల్ క్లాస్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. దీనివల్ల పొద్దుపోయేదాకా స్కూళ్లోనే ఉండాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని టెన్త్ బాలబాలికలకు రవాణా ఇబ్బంది ఉండకూడదనే సదుద్దేశంతో బండి సంజయ్ కుమార్.. ప్రధాని మోడీ కానుకగా ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు.

Also Read; TGPSC Office: భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?