Army general Rahul Singh
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ జనరల్ కీలక ప్రకటన

Op Sindoor: ఆపరేషన్ సిందూర్‌కు (Op Sindoor) సంబంధించిన కీలక అంశాలను డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ శుక్రవారం వెల్లడించారు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశం పాక్ ఎప్పటికప్పుడు చైనా నుంచి భారత్‌‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పొందిందని ఆయన చెప్పారు. భారత బలగాల మోహరింపునకు సంబంధించిన ‘రియల్ టైమ్’ ఇన్‌పుట్‌లు పొందిందని వివరించారు. నాలుగు రోజులపాటు కొనసాగిన ఈ సైనిక సంఘర్షణలో సరిహద్దులో రెట్టింపు శక్తులను భారత్ ధీటుగా ఎదుర్కొందని రాహుల్ ఆర్ సింగ్ వ్యాఖ్యానించారు. సరిహద్దులో ముగ్గురు ప్రత్యర్థులతో భారత్ పోరాడిందని, టర్కీ కూడా పాకిస్థాన్ వైపు కొమ్ముకాచిందని ఆయన బయటపెట్టారు. ‘‘పాకిస్థాన్‌ను ముందుపెట్టి చైనా వెనుక నుంచి సాధ్యమైనన్ని సహకారాలు అందించింది. టర్కీ కూడా తాను ఇవ్వగల అన్ని రకాల మద్దతును అందించి కీలకమైన పాత్ర పోషించింది’’ అని వివరించారు. ‘‘ ఒకే సరిహద్దు,, ముగ్గురు శత్రువులు’’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

Read also- Rupee Bond Market: రూపీ బాండ్ మార్కెట్‌కు కష్టకాలం.. ఆర్‌బీఐ సంకేతాలతో మందగమనం తప్పదా!

‘‘డీజీఎంవో స్థాయి అధికారుల చర్చలు జరిగిన సమయంలో, మీరు ఒక ముఖ్యమైన దళాన్ని సిద్ధంగా ఉంచారు, చర్యకు సిద్ధంగా ఉన్నారని మాకు తెలుసని పాక్ అధికారులు అన్నారు. దానిని ఉపసంహరించుకోవాలని కోరారు. అంటే, దీనిర్థం చైనా నుంచి పాకిస్థాన్‌ ఎప్పటికప్పుడు సమాచారం పొందింది’’ అని రాహుల్ సింగ్ పేర్కొన్నారు. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే పాకిస్థాన్‌కు చైనా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నట్టే తేటతెల్లమైందని జనరల్ పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు ఆయుధ పరికరాలను సప్లయ్ చేయడం ద్వారా, చైనా తన ఆయుధాలను ఇతరులపై పరీక్షించుకుంటోందని వ్యాఖ్యానించారు.

Read also- Jr NTR: ఎన్టీఆర్ ను నాలుగు సార్లు రిజెక్ట్ చేసింది.. ఎవరైతే నాకేంటి అంటున్న స్టార్ హీరోయిన్?

81 శాతం చైనా పరికరాలే

గణాంకాలను పరిశీలిస్తే గత ఐదేళ్లుగా పాకిస్థాన్ పొందుతున్న సైనిక హార్డ్‌వేర్‌లో 81 శాతం చైనా అందిస్తున్నదేనని ఆర్మీ జనరల్ రాహుల్ సింగ్ చెప్పారు. చైనా తన ఆయుధాలను ఇతర దేశాల ఆయుధాలపై పరీక్షిస్తుందని అన్నారు. కాబట్టి, చైనాకు పాకిస్థాన్ ఒక ప్రత్యక్ష ప్రయోగశాల లాంటిదని వ్యాఖ్యానించారు.

చైనాపై తీవ్ర ఆగ్రహం

చైనాపై ఆర్మీ జనరల్ రాహుల్ సింగ్ తీవ్ర విమర్శల దాడి చేశారు. యుద్ధం, రాజకీయాలు, ఇతర అంశాల్లో ఉపయోగించే ప్లాన్స్‌ను వివరించే చైనా వ్యాసం ‘థర్టీ-సిక్స్ స్ట్రాటజీమ్‌’లను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అవసరానికి అడిగి తెచ్చుకున్న కత్తితో చంపడం చైనా అవలంభించే ఒక విధానమని, యుద్ధ క్షేత్రంలో అడుగు పెట్టకుండానే భారత్‌పై దాడులకు పాకిస్థాన్‌ను ఉపయోగిస్తోందని సింగ్ పేర్కొన్నారు. చైనా కూడా ఒకనాటి బాధిత దేశమేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘నిజానికి చైనా బాధితదేశమే. అరువు తెచ్చుకున్న కత్తితో చంపుతుంది’’ అని మండిపడ్డారు. ‘సోదరుడు’ పాకిస్థాన్‌కు అన్ని విధాలా మద్దతు అందిస్తామని పదేపదే వ్యాఖ్యానించిన టర్కీపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!