Jr NTR: పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఓ స్టార్ హీరోయిన్ లెక్కలోకి కూడా తీసుకోలేదని, ఆమె ఎన్టీఆర్‌ను మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసిందనే టాక్ టాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Corona Vaccine: కోవిడ్19 వ్యాక్సిన్ వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా? ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి
ఆమె ఎవరో కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్. ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం వస్తే అలియా భట్ ఏకంగా నాలుగు సార్లు కథ వినకుండానే ఆ ఆఫర్‌లను తిరస్కరించిందని తెలిసిన సమాచారం. అయితే చాలామంది హీరోల సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లను పెట్టాలి అనుకుంటారు దర్శకులు. బాలీవుడ్ హీరొయిన్లను పెడితే సౌత్, నార్త్ రెండు ఇండస్ట్రీలు కవర్ అవుతాయనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు ఇది ఫలించకపోవచ్చు.
Also Read: Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ షూటింగ్‌లో రామ్‌కు ఊహించని ఘటన.. వెంటనే అలెర్ట్ అయ్యారు
ఎన్టీఆర్ సినిమాల్లో అలియా భట్‌కు నాలుగు హీరోయిన్‌గా చేసే అవకాశం వచ్చినప్పటికీ, ఆమె ఇతర సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఆ ఆఫర్‌లను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ “అలియా భట్ ఎన్టీఆర్‌ను లెక్కచేయకుండా, గ్లోబల్ స్టార్ అయినా తనకేం పట్టనట్లు వ్యవహరించింది” అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కొందరు ఆలియాకి ఎన్టీఆర్ కి మధ్య ఎలాంటి గొడవ లేదని, వారిద్దరూ మంచి స్నేహితులని అంటున్నారు. అంతే కాదు, ఆలియా భట్ తన క్లాత్ స్టోర్ నుండి ఎన్టీఆర్ పిల్లలకు గతంలో డ్రెస్సులు కూడా పంపిందని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని మీరే కావాలని చిచ్చు పెడుతున్నారంటూ దీటుగా సమాధానం ఇస్తున్నారు.