Cow Rain: ప్రస్తుతం, సోషల్ మీడియా ( Social Media ) వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు స్మార్ట్ ఫోన్ లో వీడియోస్ చూస్తూ.. వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి ముఖ్యంగా, రీల్స్ అనే ఫీచర్ వచ్చాక ఒక్కొక్కరు తమకున్న టాలెంట్ ను బయట పెడుతున్నారు. అయితే, ఇటీవలే చాలా మంది ఏఐ ద్వారా కొత్త కొత్త వీడియోలని క్రియోట్ చేస్తున్నారు. ఇవి జరగవు.. ఎప్పటికీ చూడలేని వీడియోలను కూడా సృష్టిస్తున్నారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Love Affair: ఒకేసారి ఆరుగురితో లవ్ ఎఫైర్.. యువతికి లైఫ్ లో గుర్తిండిపోయే ఝలక్ ఇచ్చిన అబ్బాయిలు!
ప్రపంచనలుమూలల్లో(World) ఏం జరిగినా స్మార్ట్ ఫోన్లో క్షణాల్లో వచ్చేస్తుంది. ఇలా రోజు నెట్టింట కొన్ని లక్షల వీడియోలు ( Viral Videos ) అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని బాగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తి క్రియోట్ చేసిన ఏఐ వీడియో వింతగా ఉంది. దీన్ని మనం నిజ జీవితంలో ఎప్పటికీ చూడలేము కూడా. ఇక ఈ వీడియో ఇంటర్నెట్ నే షేక్ చేస్తుంది. ఇది చూశాక .. మీరు కూడా షాక్ అవ్వడం పక్కా. ఇంతకీ ,ఆ వీడియోలో ఏం ఉందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Corona Vaccine: కోవిడ్19 వ్యాక్సిన్ వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా? ఓ అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి
ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఆవులు పడితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్ గా చూపించాడు. అసలు, అతనికి ఈ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు. ఇలా క్రియోట్ చేయడం రావడం గొప్ప విషయం. ఆకాశం నుంచి వర్షం, పిడుగులు పడతాయి. కానీ, ఏకంగా ఇక్కడ ఆవులు పడుతున్నాయి. వాటి వలన కింద కార్లన్నీ విరిగిపోతున్నాయి. దీని బట్టే మనం అర్ధం చేసుకోవాలి. ఆకాశం నుంచి చినుకులు మాత్రమే పడాలి. వేరేది ఏది పడినా కూడా సృష్టి నాశనం అవుతుంది. అందుకే దేవుడు ఇలా ప్లాన్ చేసినట్టు ఉన్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి వీడియో క్రియోట్ చేసినందుకు ” మీ సాహసాన్ని మెచ్చుకోవాలి బ్రో ” అని కొందరు అంటుండగా, ఇలాంటి వీడియోలు ఎందుకు బ్రో.. మంచిగా ఏదైనా పని చేసుకోవచ్చుగా ఇంకొకరు కామెంట్ లో రాశారు.