White sandlewood: పుష్ప స్టైల్లో గందం చెక్కలు అక్రమ రవాణా
White sandlewood (imagcredit:swetcha)
క్రైమ్

White sandlewood: పుష్ప స్టైల్లో గందం చెక్కలు అక్రమ రవాణా.. ఎక్కడంటే!

White sandlewood: మహారాష్ట్ర నుంచి అక్రమంగా రంగారెడ్డి(Ranga Reddy) జిల్లాకు శ్రీగంధం(White Sandalwood) తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. చేవెళ్ల ఏసీపీ(ACP) తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని సంగ్లి జిల్లా హంట్వాడి గ్రామం నుంచి డీసీఎంలో రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం నాగర్‌ గూడ గ్రామానికి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో కాపుగాసిన మాదాపూర్‌ ఎస్వోటీ, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా గంధం చెక్కలను పట్టుకున్నారు. ఆంధ్ర ఫర్ఫ్యూమ్‌ ఫ్యాక్టరీకి వెయ్యి కిలోల శ్రీగంధంను తరలిస్తుండగా పట్టుకున్నామని, దీని విలువ సుమారు రూ.30-35లక్షల వరకు ఉంటుందని ఏసీపీ కిషన్‌(ACP Kishan) తెలిపారు.

డిసీఎంను స్వాధీనం చేసుకున్నామని, డ్రైవర్‌ అబ్దుల్‌ అజీజ్‌, సూపర్‌ వైజర్‌ సోహెబ్‌, రైతు విజయ్‌ హనుమంత్‌ మానెను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఫ్యాక్టరీ ఓనర్‌ అబ్దుల్‌ కుర్వి, మేనేజర్‌ సిద్దిక్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో మాదాపూర్‌ ఏస్వోటి సీఐ సంజయ్‌, ఎస్సైలు సతీష్‌, అజయ్‌, సిబ్బంది, ఫారెస్ట్ అధికారి రవి కుమార్‌లు ఉన్నారు.

Also Read: Viral: తాళిబొట్లు తెంచి, వితంతువులుగా ఏడ్చే వింత ఆచారం.. ఎక్కడో తెలుసా?

పట్టించిన ‘సువాసన’
వాహన తనిఖీ సమయంలో సువాసన రావడంతో మరింత క్షుణ్ణంగా పరిశీలించగా డ్రైవర్ కేబిన్ వెనుక భాగంలో కంటైనర్ టైపులో రహస్య విభాగం కనిపించింది. దాన్ని తెరిచి చూడగా నలుపు, తెలుపు, పసుపు, నలుపు రంగుల్లో ఉన్న ఫర్టిలైజర్ బ్యాగులు ఒకదానిపై ఒకటి పేర్చి ఉన్నాయి. అందులో చిన్న చిన్న చెక్క ముక్కలు ఉండడంతో అటవీ శాఖ అధికారులు సమాచారం ఇవ్వగా వాటిని సాంటాలమ్ అల్బమ్ శాస్త్రీయ పేరు కలిగిన తెల్ల చందనంగా నిర్ధారించారు.

Also Read: Man Kills Partner: మరో ఘోరం.. ప్రేయసిని చంపి.. శవంతో రెండు రాత్రులు గడిపిన ఉన్మాది!

 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..