Man Kills Partner: భార్య భర్తలు ఒకరినొకరు దారుణంగా చంపుకుంటున్న ఘటనలు.. దేశంలో రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి. హనీమూన్ మర్డర్ కేసు (Honeymoon Murder Case) లో భర్తను భార్య అతి క్రూరంగా హత్య చేయించగా.. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లో ఓ వ్యక్తి తన భాగస్వామిని అనుమానంతో దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె డెడ్ బాడీ (Dead Body)తో రెండు రాత్రులు గడిపాడు. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన సచిన్ రాజ్ పుత్ (32), రితికా సేన్ (29) లు సహజీవనం చేస్తున్నారు. నగరంలోని గాయత్రి నగర్ లో నివాసం ఉంటున్నారు. జూన్ 27 రాత్రి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రితికా (Ritika Sen)ను హత్య చేసిన సచిన్.. ఆమె మృతదేహాన్ని జాగ్రత్తగా దుప్పటిలో చుట్టాడు. అనంతరం దానిని బెడ్ పై పెట్టి.. రెండు రాత్రులు దాని పక్కనే నిద్రించాడు. ఆదివారం రాత్రి స్నేహితుడు అనుజ్ కు ఫోన్ చేసి హత్య గురించి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. అయితే సచిన్ చెప్పిన మాటలను తొలుత అనూజ్ నమ్మలేదు. తన భార్యను హత్య చేసినట్లు సచిన్ గట్టిగా చెప్పడంతో అనూజ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
రితికపై అసూయతోనే..
అనూజ్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన బజారియా పోలీసులు.. సచిన్ ఉంటున్న ఇంటికి హుటాహుటీగా చేరుకున్నారు. మంచంపై దుప్పటితో చుట్టబడి ఉన్న భార్య రితిక డెడ్ బాడీని చూసి షాకయ్యారు. అనంతరం అదుపులోకి తీసుకొని సచిన్ ను విచారించగా హత్యకు గల కారణాలను అతడు తెలియజేశారు. దాని ప్రకారం.. సచిన్ – రితికా గత మూడేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే రితీక ఓ ప్రైవేటు కంపెనీ లో జాబ్ చేస్తుండగా.. సచిన్ ఖాళీగా ఉంటున్నట్లు చెప్పారు. దీంతో ఉద్యోగం చేస్తున్న రితికపై అతడి అసూయ ఉండేది. ఈ క్రమంలో కంపెనీ బాస్ తో రితికకు సంబంధం ఉన్నట్లు సచిన్ అనుమానించారు. ఈ విషయమై ఇద్దరి మధ్య తరుచూ గొడవ జరిగేదని తెలుస్తోంది.
Also Read: High Court On Shami: పేసర్ షమీకి బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు.. గట్టి దెబ్బ పడిందిగా!
గొంతుకోసి.. దుప్పటిలో చుట్టి
జూన్ 27 రాత్రి కూడా అదే విషయమై సచిన్ – రితికా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ తీవ్ర రూపం దాల్చడంతో రితికను సచిన్ గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసు అధికారి శిల్పా కౌరవ్ తెలిపారు. అనంతరం శవాన్ని దుప్పట్లో చుట్టిపెట్టాడని తెలిపారు. తాగిన మైకంలో స్నేహితుడికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అతడు తమకు సమాచారం ఇచ్చినట్లు పోలీసు అధికారి వివరించారు. నిందితుడు విదిషలోని సిరోంజ్ కు చెందిన వాడని పేర్కొన్నారు. రితిక – సచిన్ 9 నెలల క్రితం గాయత్రి నగర్ లోని అద్దె ఇంటిలో దిగినట్లు చెప్పారు. నిందితుడిపై హత్యారోపణల కింద కేసు నమోదు చేశామని స్పష్టం చేశారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని దర్యాప్తు అధికారి శిల్పా కౌరవ్ వివరించారు.