Negative Energy: మనలో చాలామంది వాస్తును పక్కన పెట్టి పనులు చేస్తుంటారు. అయితే, ఇలా చేసినప్పుడు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దీని వలన ఏ పనులు కూడా ముందుకు వెళ్ళవు. మధ్యలోనే ఆగిపోతాయి. ఇంటి గృహిణీలు కొన్ని పనులను ఇంట్లో చేయకూడదని చెప్పినా కూడా వాటిని చేస్తూనే ఉంటారు. మంగళవారం గోళ్ళు కొరకటం, ఇంటి మధ్యలో కూర్చొని జుట్టు దువ్వుకోవడం వంటి ఎన్నో పనులు చేస్తుంటారు. అలాగే, మహిళలు జుట్టు దువ్వుకునే సమయంల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Raghunandan Rao: మాపై అనవసరంగా నిందలు మోపారు..వెంటనే క్షమాపణ చెప్పాలి.. ఎంపీ రఘునందన్ రావు
మహిళలు జుట్టు దువ్వుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రతికూల శక్తులు జీవితాల పై పడుతుంది. ముఖ్యంగా ఇంట్లో జుట్టు విరబోసుకొని మహిళలు తిరగకూడదు. అలాగే జుట్టు విరబోసుకొని మహిళలు నిద్రించకూడదు కూడా. నటింట్లో దివ్వెన పట్టుకుని జుట్టు దువ్వకూడదు. ఎందుకంటే వెంట్రుకలు ఇంట్లో పడటం వలన ప్రతికూల శక్తులు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుందని పెద్దవాళ్లు కూడా చెబుతూ ఉంటారు. అందుకే జుట్టు దువ్వుకునేటప్పుడు ఆడవాళ్ళు బయటకి వెళ్ళి దువ్వుకోవాలి. వెంట్రుకలు నట్టింట్లో పడితే శనిదేవున్ని పిలిచినట్టే. ఆయన వెంటనే ఇంట్లో ప్రతికూల శక్తులను ఆహ్వానిస్తాడు. మగవారు పనులు మొదలు పెట్టేటప్పుడు జుట్టు విరబోసుకుని మహిళలు ఎదురు వస్తే , ఆ పనులు మధ్యలోనే ఆగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Congress vs BJP: డీఎస్ విగ్రహావిష్కరణపై వార్.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్.. ఎందుకంటే?