Raghunandan Rao: బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ అనుమతుల రద్దుపై ఎంపీ రఘునందన్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన, అనుమతులు ఇచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీపై చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి వాటర్ ట్రైబ్యునల్ తీర్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ వల్లనే బనకచర్లకు అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.
Also Read: Bollywood Heros: చీరలు కట్టిన బాలీవుడ్ హీరోస్.. పాలు పితుకుతున్న అక్షయ్ కుమార్.. వీడియో వైరల్
ఇకపై అనవసర ఆరోపణలు మానేసి తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రఘునందన్ రావు స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని, పదేండ్లు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం దమ్ముంటే రాజకీయాలు మాని, రండి కేంద్రం దగ్గరకు కలిసి వెళ్దామని పిలుపునిచ్చారు.
Also Read: Telangana BJP President: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? అమిత్ షా రాకతో క్లారిటీ వచ్చేనా?