Bollywood Heros: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వేల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఫన్నీ వీడియోస్ ఉంటాయి. ఫేక్ వీడియోలు కూడా ఉంటాయి. కొందరు ఫ్యాన్-మేడ్ కంటెంట్‌గా తమ అభిమాన హీరోస్ కోసం రక రకాల వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో బాలీవుడ్ హీరోలు పల్లెటూర్లలో పని చేస్తున్నారు.
ఆ వీడియోలో అక్షయ్ కుమార్ పాలు పితుకుతుండగా, ఇక సల్మాన్ ఖాన్ అయితే బట్టలు ఉతుకుతున్నాడు, రణబీర్ కపూర్ చపాతీలు వేస్తున్నాడు, అమీర్ ఖాన్ బకెట్ లో బట్టలు వాష్ చేస్తున్నాడు. షారూఖ్ ఖాన్ బావిలో నుంచి నీళ్ళను తొడుతున్నాడు. టైగర్ ష్రాఫ్ బోరు కోడతూ వాటర్ నింపుతున్నాడు. మొదటి సారి ఈ వీడియో చూసిన వాళ్ళు షాక్ అవ్వడం పక్కా. ఐతే, ఇది ఎడిట్ చేసిన వీడియో. ఏఐ ద్వారా చాలా బాగా క్రియోట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బాలీవుడ్ హీరోలను ఇలా చూసిన ఆడియెన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే చీరలు బావున్నాయి కానీ, ఇలా ఏఐ తో వీడియోలు చేయడం చాలా ఫన్నీగా ఉంది. చూసుకుని నవ్వుకోవచ్చు గాని, ప్రతి సారి ఇదే వర్కవుట్ కాదని కొందరు అంటున్నారు. డీప్ ఫేక్ మీద ఇప్పటికే ఎన్నో వీడియోలు వచ్చాయి. ఇది రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.
Also Read: Kuberaa: కుబేర సినిమాలో రష్మిక డబ్బు బ్యాగ్ ఎక్కడ ఉంది? శేఖర్ కమ్ముల సమాధానం చెప్పాల్సిందే?
ఇదిలా ఉండగా.. స్టార్ హీరోలు ప్రస్తుతం, కొత్త సినిమాలతో బిజీగా ఉన్నారు. అమీర్ ఖాన్, బాలీవుడ్‌లో “మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్”గా పిలుస్తారు. ఈ స్టార్ హీరో నటుడు, నిర్మాత, దర్శకుడిగా పని చేశాడు. అతను తన నటన, సామాజిక సమస్యలపై దృష్టి పెట్టే సినిమాలు, మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. అమీర్ ఖాన్ నటించిన సినిమాలలో దంగల్ సినిమా చాలా ప్రత్యేకం. రెజ్లర్లు గీతా, బబితా ఫోగట్‌ల జీవిత కథ ఆధారంగా దంగల్ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ నటన అందర్ని మెప్పించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.