Tummala Nageswara Rao (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Tummala Nageswara Rao: 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు

Tummala Nageswara Rao: తెలంగాణలో వచ్చే మూడేళ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్(Oil Palm) సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Min Tummala Nageswara Rao) తెలిపారు. దేశంలో 12 లక్షల ఎకరాల్లో ఈ పంట ఉంటే ఏపీలో 6 లక్షల ఎకరాలు, తెలంగాణ(Telangana)లో 3 లక్షల ఎకరాల్లో సాగైందని చెప్పారు. మూడేళ్లలో ఏపీ(AP)ని మించి పోవాలని, ఈ మేరకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్‌లో భాగంగా చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దేవుని ఎర్రవల్లిలో రైతు, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి(Sathya Narayana Reddy) పొలంలో మొక్కలు నాటారు.

ప్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు కోసం 12.20 ఎకరాలకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్(Drip) ఇస్తున్నామని, ఉమ్మడి రంగారెడ్డి(Ranga Reddy) జిల్లాలో మాత్రం ఎన్ని ఎకరాలు సాగుచేసినా ఇస్తామని హామీ ఇచ్చారు. రైతుకు మొక్కల దగ్గరి నుంచి మార్కెటింగ్(Marketing) దాకా ప్రభుత్వం సహకరిస్తుందని, ఈ మేరకు ప్రతి జిల్లాకు ఆయిల్ ప్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిద్దిపేటలో రిపైనరీ, ప్యాకింగ్ సహా అతి పెద్ద ప్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్యాక్టరీలన్నీ ప్రీ పొల్యూషన్‌తో ఉంటాయని స్పష్టం చేశారు.

Also Read: Land Acquisition: భూసేకరణ వేగవంతం చేయాలి.. అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు!

హైదరాబాద్‌కు దగ్గరలో మార్కెట్ ఏర్పాటు

పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలో కూరగయాలు ఎక్కువగా పండిస్తున్నందున, హైదరాబాద్‌(Hyderabad)కు దగ్గరలో మార్కెట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య(MLA Kale yadaiah), రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గోనె ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, హార్టికల్చర్ అధికారులు పాల్గొన్నారు.

Also Read: Chief Engineer Harassment: మహిళా ఉద్యోగులపై చీఫ్ ఇంజనీర్ లైంగిక వేధింపులు.. సీతక్క వద్దకు ఇష్యూ!

 

 

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు