Land Acquisition: హైదరాబాద్‌లో చేపట్టిన కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి (Harichandana Dasari) అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ (Collector) సమావేశ మందిరంలో ఆమె పారడైజ్ -శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్, పాతబస్తీ మెట్రో కారిడార్ నిర్మాణ పనుల పురోగతిపై వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
Also Read: Jogulamba Gadwal Crime: అక్రమ సంబంధానికి అడ్డొస్తాడని.. ప్రియుడితో హత్య చేయించిన భార్య!
అందరికీ న్యాయం జరిగేలా కార్యాచరణ
ఈ కారిడార్ 44వ జాతీయ రహదారిపై మొత్తం 18 కిలోమీటర్ల పొడవున, 200 అడుగుల వెడల్పుతో నిర్మించనున్నారు. ఇది శామీర్‌పేట రింగ్‌రోడ్డు నుంచి లోతుకుంట వరకు 12 కిలోమీటర్లు, లోతుకుంట నుంచి ప్యారడైజ్ వరకు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. భూసేకరణలో తలెత్తిన అభ్యంతరాలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ (Collector) ఆదేశించారు. హైదరాబాద్, (Hyderabad) సికింద్రాబాద్‌లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఈ కారిడార్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇది ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. భూసేకరణ ప్రక్రియలో అందరికీ న్యాయం జరిగేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ (Collector) ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ (Collector) ముకుంద్ రెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరామ్, ఖైరతాబాద్ తహసీల్దార్ నయీముద్దీన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.
పాతబస్తీలో మెట్రో పనుల వేగవంతం..
అదేవిధంగా, హైదరాబాద్ Hyderabad)పాతబస్తీ మెట్రో కారిడార్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ (Collector Harichandana ) హరిచందన దాసరి మెట్రో, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి చంద్రాయణగుట్ట వరకు సుమారు ఏడున్నర కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో కారిడార్ పాత నగరంలో కనెక్టివిటీని గణనీయంగా పెంచుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కూడా పాతబస్తీని అసలు నగరంగా అభివర్ణించిన విషయాన్ని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు.
ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి రోడ్లను వంద అడుగులకు పెంచే చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. ఇప్పటివరకు మొత్తం 821 ఆస్తులను స్వాధీనం చేసుకోగా, 435 మంది యజమానులు అంగీకరించారని, వారికి రూ. 283 కోట్లు పరిహారంగా చెల్లించినట్లు అధికారులు తెలిపారు. భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. హైదరాబాద్ , (Hyderabad) మెట్రో రైల్ లిమిటెడ్, కారిడార్ వెంబడి ఉన్న అన్ని మతపరమైన, చారిత్రక కట్టడాలను కాపాడుతుందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (Collector) (రెవెన్యూ) ముకుంద్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (అర్బన్ ల్యాండ్ సీలింగ్), మెట్రో (Metro) అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Telangana Government: సర్కార్ కీలక నిర్ణయం పరిపాలనలో మరింత పారదర్శకత!