Viral Video: రోడ్లపైకి వర్షపు నీరు చేరడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ముఖ్య వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రోడ్లపై వెళ్లలాంటేనే చాలా మంది భయపడుతుంటారు. ముఖ్యం ద్విచక్రవాహనదారులు అలాంటి పరిస్థితుల్లో బైక్ ను రోడ్లపైకి అసలే తీసుకురారు. ఇంజిన్ లోకి నీళ్లు వెళ్లి బైక్ మెురాయిస్తుందని భయపడతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం నడుంలోతు నీళ్లల్లో ఎంచక్కా స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
సూరత్‌లో ఘటన
గుజరాత్ (Gujarat) వ్యాప్తంగా ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సూరత్ (Surat)లో గత ఆదివారం నుంచి క్రమం తప్పకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద పోటెత్తుతోంది. వీధులు నదులను తలపిస్తున్నాయి. సూరత్ లోని చాలా ఏరియాల్లో రోడ్లపై నడుంలోతు నీళ్లు వచ్చి చేరడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఓ వ్యక్తి మాత్రం వరద నీటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. స్కూటీ (Scooty)పై వెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోడ్డుపై గుంతలు, మ్యాన్ హోల్ ఉంటాయన్న బెరుకు లేకుండా అతడు స్కూటీపై ముందుకు సాగుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో అది కాస్త వైరల్ గా మారింది.
The only positive in the video is the confidence the scooter rider has on the quality of roads under the water. He is well aware that there exist a proper road and he can risk his life to ride in flood. Hats off to Govt 😀pic.twitter.com/qL0EGfQGxp
— Zaffar 🇮🇳 (@Zaffar_Nama) June 26, 2025
నెటిజన్ల రియాక్షన్
వరద నీటిలో స్కూటీ నడుపుతున్న దృశ్యాలను చూసి నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. నీటిలోనూ వెళ్లాల్సినంత అత్యవసరం ఏమి వచ్చిందో? అంటూ సెటైర్లు వేస్తున్నారు. నీ ధైర్యానికి సెల్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సూరత్ లో ఉన్న పరిస్థితులను తన చర్యతో యావత్ దేశానికి తెలిసేలా చేశాడని ప్రశంసిస్తున్నారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ (Drainage System)ను అతడు ఎత్తిచూపాడని మరికొందరు అంటున్నారు. మెుత్తం మీదా స్కూటీ నడిపిన వ్యక్తి ఎవరో స్పష్టత లేనప్పటికీ.. అతడు చేసిన పనికి మాత్రం దేశవ్యాప్తంగా చర్చ జరగడం గమనార్హం.
Also Read: Swecha Suicide: యాంకర్ స్వేచ్ఛ సూసైడ్.. తెరపైకి షాకింగ్ నిజాలు.. బాంబ్ పేల్చిన తండ్రి!
40 ఏళ్ల రికార్డ్ బద్దలు
ఇదిలా ఉంటే గత ఆదివారం సూరత్ లో భారీ వర్షం కురిసింది. గత 40 ఏళ్ల వర్షపాతపు రికార్డును అది బద్దలు కొట్టిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య 9.53 సెం.మీ వర్షపాతం కురిసినట్లు ఐఏండీ తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ స్తంబించిపోవడంతో ప్రభుత్వం అత్యవసర సేవలకు ఉపక్రమించింది.