Pakistan Floods (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Pakistan Floods: ప్రాణాలు కాపాడలేరా.. కొంచెమైనా సిగ్గుండాలి.. పాక్‌పై ఆ దేశ పౌరులే ఫైర్!

Pakistan Floods: దయాది దేశం పాకిస్థాన్ లో పెను విషాదం చోటుచేసుకుంది. ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్ కురిసిన భారీ వర్షాలకు అక్కడి స్వాత్ నది ఒక్కసారిగా ఉప్పొంగింది. నదిలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ప్రవాహం దాటికి కొట్టుకుపోయారు. వారిలో ఏడుగురు మరణించగా.. 11 మంది ఆచూకీ కోసం రెస్క్యూ బృందం గాలిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..
ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్ ఫిజాగత్ ప్రాంతంలోని మింగోరా బైపాస్ కు ఆనుకొని ప్రవహిస్తున్న స్వాత్ నదిని చూసేందుకు బాధిత కుటుంబం వచ్చింది. శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 18 మంది కుటుంబ సభ్యులు నది ఒడ్డున కూర్చొని ఎంతో సంతోషంగా గడిపారు. అక్కడే కూర్చొని అల్పాహారం తినడం అల్పాహారం సేవించడం మెుదలుపెట్టారు. అయితే గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా స్వాత్ నదిలో ఒక్కసారిగా వరద ప్రవాహం పోటెత్తింది.

నీరు చుట్టుముట్టడంతో..
తొలుత సాధారణ ప్రవాహంగానే ఆ కుటుంబం భావించింది. దీంతో తమ ఆనందంలో వారంతా మునిగిపోయారు. ఈ క్రమంలో ఒక్కసారిగా నది ప్రవాహం పెరిగి వారిని చుట్టుముట్టింది. అన్ని వైపుల నుంచి నీరు వచ్చి అష్టదిగ్భందనం చేయడంతో వారు తప్పించుకోలేకపోయారు. కుటుంబంలోని 18 మంది ఒక్కొక్కరిగా ప్రవాహంలో కొట్టుకుపోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందం.. నదిలో 7 మృతదేహాలను గుర్తించింది. మిగిలిన వారి ఆచూకి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Telangana BJP President: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? అమిత్ షా రాకతో క్లారిటీ వచ్చేనా?

పాక్ పౌరులు ఫైర్!
అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో పాక్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలే విమర్శలు గుప్పిస్తున్నారు. 18 మంది నదిలో చిక్కుకున్నారని తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నిస్తున్నారు. తొలుత ప్రవాహం సాధారణంగానే ఉందని, కాపాడేందుకు ఎవరూ రాలేదని ఫైరవుతున్నారు. కొంచెమైన సిగ్గుండాలని ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రవాహం ఉద్ధృతమయ్యాక కూడా హెలికాప్టర్ పంపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకుని ఉంటే 18 మంది బతికేవారని చెబుతున్నారు. వారి చావులకు కచ్చితంగా పాక్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read This: Nagarjuna Sagar: సాగర్ డ్యామ్‌పై లొల్లి.. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదం.. ఎందుకంటే?

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు