Congress Ministers (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Congress Ministers: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా మంత్రుల పర్యటన

Congress Ministers: విద్వంసం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి, తెలంగాణ ప్రజల అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తున్నామని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar), తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao),కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(Komati Redddy Venkat Reddy)లు హాజరై పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం

హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ చిరకాల స్వప్నం అయిన 50 సీట్లుతో కూడిన మెడికల్ పీజీ సెంటర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ మంజూరు చేశారు. హుస్నాబాద్‌కి పీజీ మెడికల్ సెంటర్(PG Medical Center) మంజూరు పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. పీజీ మెడికల్ సెంటర్ వల్ల హుస్నాబాద్ హాస్పిటల్ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు. అంతకుముందు హుస్నాబాద్ నియోజకవర్గం బస్వాపూర్ గ్రామానికి చేరుకున్న మంత్రులకు కాంగ్రెస్ పార్టీ(Congress Party) కార్యకర్తలు నేతలు ఘన స్వాగతం పలికారు. బస్వాపూర్ నుండి హుస్నాబాద్ వరకు 15 కిలోమీటర్ల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆద్యంతం జరిగిన ర్యాలీ మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. హుస్నాబాద్ వీధుల గుండా సాగిన ర్యాలీ హస్పిటల్ వరకు జరిగింది.

వైద్యశాలకు మంత్రులు శంకుస్థాపన

హుస్నాబాద్‌లో 82.00 కోట్ల రూపాయలతో 150 పడకల ప్రభుత్వం వైద్యశాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అనంతరం 11.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని(Maternal and Child Health Center) ప్రారంభించారు. హాస్పిటల్ లో నూతనంగా నిర్మించిన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ(ICU), ఎన్ బిఎస్ యూ(NBSU), ఓపీ బ్లాక్(OP Block), పోస్ట్ నెటల్ వార్డు, ఫార్మసీ , ల్యాబ్ ,ప్రసూతి విభాగాలకు ప్రారంభించారు.77.20 కోట్ల రూపాయలతో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి పరుచుటకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహలు శంకుస్థాపన చేశారు.

Also Read: Beggar Free City: బెగ్గర్ ఫ్రీ సిటీ కోసం జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్

77.20 కోట్ల రూపాయలతో రాజీవ్ రహదారి

అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల(Govt Boyes School)లో జరిగిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చిరకాలంగా ఎదురు చూస్తున్న హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కేబినెట్ మంత్రుల సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటున్నామని శాతవాహన యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కాలేజి తరగతులు హుస్నాబాద్లో ఈ సంవత్సరం నుండి ప్రారంభం అవుతున్న సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. 82.00 కోట్ల రూపాయలతో 150 పడకల ఆరోగ్య కేంద్రానికి,77.20 కోట్ల రూపాయలతో రాజీవ్ రహదారి కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు రెండు వరుసల రహదారుల నుండి నాలుగు వరుసల రహదారికి ఫేజ్ 2 కు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. నూతనంగా 11.50 కోట్ల రూపాయలుతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకున్నామని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కాలువల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. తనని గెలిపించిన హుస్నాబాద్ గౌరవాన్ని పెంచుతున్నాని హుస్నాబాద్‌ను అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుంచుతానన్నారు. హుస్నాబాద్‌కి వచ్చిన మంత్రులు హుస్నాబాద్ అభివృద్ధికి అభయం ఇవ్వాలని కోరారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి , ఇంజినీరింగ్ కాలేజీ ,టూరిజ్ ప్రాజెక్ట్ లు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయనీ తెలిపారు.

సమాజంలో మార్పు రావాలంటే

మంత్రి దామోదర రాజనర్సింహ(Min Damodar Raja Narasimha) మాట్లాడుతూ హుస్నాబాద్‌కు 50 సీట్ల మెడికల్ పీజీ సెంటర్‌ను ప్రకటించారు. తెలంగాణ గొంతు తెలంగాణ హక్కును పార్లమెంట్‌లో యావత్ దేశానికి వినిపించిన వ్యక్తి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) అని కొనియాడారు. గత 16 నెలల్లో హుస్నాబాద్ అభివృద్ధిను చూస్తే పొన్నం ప్రభాకర్ ఏ ఒక్క శాఖను వదలరు నా హుస్నాబాద్ అని అభివృద్ధి నీ ఇక్కడికి తీసుకొస్తారనీ తెలిపారు. నా ప్రజల ఆరోగ్యం నా బాధ్యత నా ప్రభుత్వం బాధ్యత అని ఇక్కడికి పొన్నం ప్రభాకర్ హాస్పిటల్ తెచ్చారన్నారు. సమాజంలో మార్పు రావాలంటే విద్యా, వైద్యం, నైపుణ్యం ఉండాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వంలో 16 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేశామని అంతర్జాతీయ స్థాయిలో మన ఆడ బిడ్డలు నర్‌లు, డాక్టర్‌లు ఉండాలని కోరుకున్నారు. ఒకప్పుడు హుస్నాబాద్ నక్సల్ ప్రాంతం, కమ్యూనిస్ట్ ప్రాంతం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రాంతంగా మారిందని తెలిపారు. గత 50 సంవత్సరాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య పెరగలేదు. కానీ ఇప్పుడు అదనంగా మాత శిశు హాస్పిటల్‌లో కలిసి 250 పడకలు వచ్చాయనీ హుస్నాబాద్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ

రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం నుండి ఆర్థిక విధ్వంసం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నామని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని తెలంగాణ అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకుపోతున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యవసాయం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిందని 40 వేల కోట్లు నేరుగా రైతుల(Farmers) ఖాతాలో వేసిందని పేర్కొన్నారు. నెల రోజుల్లో సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి చేత ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ(oil palm Factory) ప్రారంభిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయిల్ ఫామ్ పంట వల్ల రైతులు ఆర్థికంగా స్థిరత్వం ఉంటుందని తెలిపారు. తెలంగాణ భూములు(Telangana Lands) ఎడారి భూములు కాదని పంటలు పండే పుణ్యభూమి దక్కన్ పీఠభూమిగా అభివర్ణించారు. హార్టికల్చర్(Horticulture) పంటలు పండించాలని ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని పేర్కొన్నారు. హుస్నాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Also Read: Medchal district: భారీ శబ్ధాలు దుమ్ము ధూళితో ప్రజలు ఉక్కిరిబిక్కిరి.. ఎక్కడంటే!

పది రోజుల్లో పనులు ప్రారంభం

మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. 77 కోట్లతో హుస్నాబాద్ నుండి సుందరగిరి వరకు ఫేజ్ 2 కింద రెండు రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. సుందరగిరి నుండి కొత్తపల్లి వరకు 80 కోట్లతో నాలుగు వరుసల రహదారి కి వారం రోజుల్లో మంజూరు అవుతుందని, దానికి పది రోజుల్లో పనులు ప్రారంభం అయ్యేలా చూస్తామన్నారు. 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం అందించామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్(Gouravelli Project) కాలువల పనులు వేగంగా పూర్తి చేసి త్వరలోనే పంట పొలాలకు సాగు నీరు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు కలలు కన్నా హుస్నాబాద్ అభివృద్ధికి మేము తమంత అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ హేమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Just In

01

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?