Mango Farmers (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mango Farmers: మామిడి రైతులను ముంచిన వాతావరణం.. ధర రాక దిగులు

 Mango Farmers: పండ్లలో రాజుగా చెప్పుకునే మామిడి ఈ ఏడాది రైతులకు కన్నీరే మిగిల్చింది. ఈసారి కాలం కలిసి రాకుండాపోయి మామిడి(Mango) రైతును నిలువునా ముంచింది. వాతావరణం(weather)లో చోటు చేసుకున్న మార్పులు అకాల వర్షాలు, ఈదురుగాలులు, తెగుళ్ల దాడితో మామిడి రైతు కుదేలు అయ్యాడు. ప్రతికూల పరిస్థితుల కారణంగా మామిడి కాయలు రాలిపోయి, దిగుబడి తగ్గిపోయి సరిపడ ధర లేకపోవడంతోపాటు మే నెలలో వచ్చిన ఆకాల వర్షాలతో చెట్టుమీద ఉన్న కాయల్లో తెల్ల పురుగులు పడడంతో కనీసం చెట్టు మీద కాయలు కోయకుండానే వదిలేయాల్సిన పరిస్థితి రావడంతో రాష్ట్రంలోని మామిడి రైతులు చేసిన కష్టం పెట్టిన పెట్టుబడి నష్టపోయి ఆర్థికంగా చతికల పడిపోయారు.

మొదటి నుంచి పగబట్టిన వాతావరణం

రాష్ట్రంలోని పాత వరంగల్(Warangal), మెదక్(Medak), కరీంనగర్(Karimnagar) జిల్లాల్లో మామిడి తోటల సాగు ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాలు సహా తెలంగాణ రాష్ట్రం(Telangana)లో మొత్తం మామిడి తోటలపై ఈ ఏడాది మొదటి నుంచి వాతావరణం పగబెట్టింది. ఎప్పుడూ లేని విధంగా ఫిబ్రవరిలో వచ్చిన వచ్చిన పొగమంచు కారణంగా పూత మాడిపోయిడి కాత సరిగా రాలేదు. ఇంత ప్రతికూల పరిస్థితిని తట్టుకుని మిగిలిన కాయలు అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల వానల కారణంగా మామిడి కాయలు భారీగా రాలిపోయాయి. దీనికి తోడు తెగుళ్ల దాడితో మామిడి దిగుబడి బాగా తగ్గిపోయింది. మూలుగుతున్న నక్కపై తాటి పండు పడ్డ చందంగా పంట దిగుబడి సరిగా రాక ఇబ్బంది పడుతున్న మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

చెట్టుపై నుంచి తెంపకుంటే నష్టం తెంపితే కష్టం..

రాష్ట్రంలోని మామిడి రైతుల పరిస్థితి మునుపెన్నడు లేని విధంగా దయనీయంగా మారింది. చెట్టుపై నుంచి కాయలు తెంపుకుంటే నష్టం వాటిల్లే పరిస్థితి. తెంపితే గిట్టుబాటు ధర లేక కనీసం కాయలు తెంపిన కూలీ డబ్బులు రావడం కష్టంగా మారింది. దీంతో మామిడి రైతులు గతంలో ఎప్పుడూ లేనివిధంగా నష్టాల ఊబిలో చిక్కుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో సాగయ్యే కొల్లాపూర్(Kollapur) మామిడికి దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఫలాన్ని పండిస్తున్న రైతులు మాత్రం మూడేళ్లుగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వాస్తవానికి దిగుబడి తగ్గినప్పుడు డిమాండ్ పెరిగి రేటు పెరగాలి కానీ అందుకు భిన్నంగా ఈసారి ధరలు దారుణంగా పడిపోయాయి. పంట సాగుకు రైతులు పెట్టిన పెట్టుబడికి వచ్చినా దిగుబడి చూస్తే క్వింటాకు ధర రూ.60 వేల నుంచి 70 వేల వరకు పలికితే రైతు నష్టాల నుంచి బయట పడే అవకాశం ఉండేది. అలాంటిది రూ.25 వేల నుంచి 30 వేలు పలికితే పెట్టుబడులు చేతికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈసారి ఆనష్టాల తీవ్రత మరింత పెరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మామిడి కౌలురైతుల తిప్పలు చెప్పరానివిగా మారాయి. మామిడి తోటలు గుత్తకు తీసుకున్న కౌలురైతులంతా పెద్ద ఎత్తున నష్టపోయారు.

Also Read: Nagarkurnool Survey: చెంచులపై కేద్రం ఫోకస్.. వారి అభివృద్ధికి రెండేళ్ల ప్రత్యేక ప్రణాళికలు

మీద మెరుగు.. లోపల పురుగులు

ప్రతికూల వాతావరణం కారణంగా మామిడి దిగుబడి 30 శాతానికి పడిపోయిందని ఉద్యానవన శాఖ(Department of Horticulture) అధికారులు తేల్చి చెప్పారు. చీడపీడలతో అసలు పూతే నిలవలేదు. వాటిని అరికట్టేందుకు రైతులు పెద్ద ఎత్తున పురుగు మందులు, ఎరువులు వాడటంతో పెట్టుబడులు పెరిగాయి. అకాల వర్షాలు, వడగళ్ల వాన, ఈదురు గాలులకు కాయ రాలిపోయి ఉన్న దిగుబడి తగ్గిపోయింది. వచ్చిన పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో మామిడికి సరైన ధర లేకుండాపోయింది. మార్కెట్లో కాయలు తగ్గిపోయిన తరువాత అనేక కష్ట నష్టాలకు ఓర్చి కాపాడుకున్న చివరికి దశ మామిడి కాయకు అయిన మంచి ధర వస్తుందని ఆశపడ్డ రైతులకు మే చివరి వారంలో కురిసిన ఆకాల వర్షాలతో నిరాశే మిగిలింది. చెట్టుపై చూడడానికి మామిడి కాయలు చక్కగా కనబడ్డ లోపల తెల్ల పురుగులు పెరగడంతో మామిడికాయలు పనికి రాకుండా పోయాయి. దీంతో అనేక మంది రైతులు వేలాది ఎకరాల్లో మామిడి కాయలు కోయకుండ చెట్లపై వదిలేశారు. కోసిన కాయలు కూడ తోటల్లోనే కుప్పలు కుప్పలు కుప్పలుగా పడేశారు. మామిడి నష్టం అంచనా వేసి కుదేలు అయిన మామిడి తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మామిడి రైతులు కోరుతున్నారు.

కాయలు కోయకుండ వదిలేశాం

ఈ సారి వాతావరణ ప్రతికూల పరిస్థితులతో దిగుబడి బాగా తగ్గింది. అనేక తిప్పలు పది మందులు కొట్టి ఎరువులు వేసి చివరి వరకు కాపాడుకున్న కాయకు మంచి రేటు వస్తుందని ఆశపడ్డ. చివరికి మే(May) నెల చివరి వారం జూన్ నెల ఆరంభంలో కురిసిన వర్షాలతో మంచి సైజుకు వచ్చిన మామిడి కాయల్లో తెల్లపురుగు తయారు అయ్యింది. ఆ కాయలు కోయకుండా చెట్టుపైనే వదిలేశాం. కోసిన మామిడికాయలు కూడా తోటలోనే పడేశాం. ఇంతటి ప్రతికూల పరిస్థితి మునుపెన్నడూ చూడలేదు. పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

కనీసం కౌలు డబ్బులు రాలేదు

గత 20 సంవత్సరాలుగా మామిడి తోటలు కౌలుకు పట్టి జీవనం సాగిస్తున్నాను. గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి మామిడి తోటల్లో తీవ్ర నష్టం మిగిలింది. పెట్టుబడి, చేసిన కష్టం పూర్తిగా పోయింది. కనీసం తోటకు చెల్లించిన కౌలు డబ్బులు కూడా రాలేదు. అకాల వర్షాలు ఈదురుగాలులు, తెగులు, గిట్టుబాటు ధర లేకపోవడం, చివరికి మిగిలిన కాయలకు తెల్ల పురుగు రావడంతో కాయలు కోయకుండానే వదిలివేయాల్సిన పరిస్థితి వచ్చింది. తీవ్రంగా నష్టపోయి డీలాపడ్డ మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Aalo Read: Viral News: ఆమె పంట పడింది.. రెండేళ్లుగా వెతుకుతున్నది దొరికింది

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?