Software Employee Arrest: మంచి జీతం, స్థిరమైన జీవితం ఉన్నా అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే కోరికతో డ్రగ్స్ దందాలోకి దిగిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రెండవసారి పట్టుబడ్డాడు. (police) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన 25 ఏళ్ల వెంకట జగదీశ్వర్ రెడ్డి (Jagadishwar Reddy) బీటెక్ పూర్తి చేసి బెంగళూరులోని కాట్నీవెల్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో చెడు సావాసాల వల్ల డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత తనే డ్రగ్స్ విక్రయించడం మొదలుపెట్టాడు. (Bangalore) బెంగళూరుకు చెందిన సైఫ్ షరీఫ్ అనే వ్యక్తి నుంచి గ్రాము ఎండీఎంఏ డ్రగ్‌ను రూ. 1,500 లకు కొని, హైదరాబాద్ తీసుకొచ్చి ఒక్కో గ్రామును రూ. 5,000 నుంచి రూ. 8,000 లకు విక్రయిస్తున్నాడు.
Also Read: CP Sudheer Babu: 3.5 కోట్ల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ!
ఈ డ్రగ్స్ దందాలో భాగంగా గతంలో (Uppal Excise Police) ఉప్పల్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడి జైలు పాలయ్యాడు. ఆ కేసులతో ఉద్యోగం కూడా కోల్పోయాడు. కొన్ని రోజుల క్రితం కండిషన్ బెయిల్‌పై విడుదలైన జగదీశ్వర్ రెడ్డి, (Jagadishwar Reddy) మళ్ళీ డ్రగ్స్ దందా ప్రారంభించాడు. బెంగళూరు . (Bangalore) నుంచి 23.3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ కొని హైదరాబాద్ (Hyderabad)వచ్చాడు. మైలార్‌దేవపల్లిలోని మెహిఫిల్ హోటల్ వద్ద జగదీశ్వర్ రెడ్డి డ్డి, (Jagadishwar Reddy) ఉన్నాడని సమాచారం అందుకున్న డీటీఎఫ్ సీఐ ప్రవీణ్ కుమార్, (CI Praveen Kumar) ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడి చేసి అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఎండీఎంఏ డ్రగ్, సెల్‌ఫోన్, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసులు నమోదు చేసి శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులకు (Shamshabad Excise Police) అప్పగించారు.
Also Read: Betting Apps promotion: బెట్టింగ్ యాప్‌ల ప్రమోటర్లు అరెస్ట్!