Betting Apps promotion( image credit: swetcha reporter)
క్రైమ్

Betting Apps promotion: బెట్టింగ్ యాప్‌ల ప్రమోటర్లు అరెస్ట్!

Betting Apps promotion: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న నలుగురు ఇన్‌ఫ్లుయెన్సర్లను సైబరాబాద్ (Cyberabad) సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఒక్కో ప్రమోటర్ ఈ విధంగా నెలకు రూ. 25 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు వెల్లడైంది. సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీ సాయి శ్రీ (DCP Sai Sri) ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. చిన్నంశెట్టి నాగ రాకేశ్, పొట్టవత్తిని దీపక్, గుగులోత్ శ్రీరాం నాయక్, హేమంత్ కుమార్లకు టెలిగ్రామ్ యాప్‌లో వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ నలుగురు పదికి పైగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, (Online Cricket Betting) ఇతర యాప్‌లను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మియాపూర్‌కు చెందిన ఓ యువకుడు, అతని స్నేహితుడు ఈ బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పెట్టి దాదాపు రూ. 60 లక్షలు పోగొట్టుకున్నారు.

 Also Read: Secunderabad Bonalu 2025: ఉజ్జయిని మహంకాళి జాతరకు విస్తృత ఏర్పాట్లు!

నలుగురిని అరెస్ట్

బాధితులు ఫిర్యాదు చేయగా, సైబరాబాద్ (Cyberabad) ఏసీపీ రవీందర్, (ACP Ravinder) సీఐ శంకరయ్య, ఎస్సైలు యాదగిరి రావు, సందీప్ రాజ్, జైప్రకాష్ గౌడ్, స్నేహా, క్రాంతికిరణ్‌లతో కూడిన బృందం విచారణ చేపట్టింది. (Betting app) బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు టెలిగ్రామ్‌లో ప్రత్యేకంగా గ్రూప్‌లు ఏర్పాటు చేసి మరీ ఆన్‌లైన్ బెట్టింగ్ (Online betting) యాప్‌లను ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడైంది. చిన్న చిన్న మొత్తాలను లాభంగా వచ్చాయని చూపిస్తూ, బెట్టింగ్‌లకు పాల్పడేవారి నమ్మకాన్ని సంపాదించి లక్షలు కొల్లగొట్టినట్లు తేలింది.

 2019 నుంచి 2025

లావాదేవీల కోసం (Fake Aadhaar) నకిలీ ఆధార్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు, నగదును బదిలీ చేయడంలో మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది. ఇలా 2019 నుంచి 2025 మధ్య ఈ లావాదేవీలు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 10 మొబైల్ ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు, 5 ఏటీఎం కార్డులు, 9 బ్యాంక్ పాస్‌బుక్‌లు, 2 చెక్ బుక్కులు, 1 పాన్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని డీసీపీ సాయి శ్రీ (DCP Sai Sri) తెలిపారు. త్వరలోనే మరికొందరు నిందితులను కూడా అరెస్ట్ చేస్తామన్నారు.

 Also Read: CM Revanth Reddy: కల్వకుంట్ల ఫ్యామిలీకి వేల కోట్లు ఎక్కడివి?.. సీఎం సంచలన కామెంట్స్!

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ