CP Sudheer Babu: పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన రూ. 3.5 కోట్ల విలువైన 1130 మొబైల్ ఫోన్లను రాచకొండ పోలీసులు (Rachakonda Police) రికవరీ చేశారు. కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు (Rachakonda CP Sudheer Babu) ఆ ఫోన్లను వాటి సొంతదారులకు అప్పగించారు. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, వాటి దొంగతనాలు, పోగొట్టుకోవడం కూడా ఎక్కువయ్యాయి. రద్దీగా ఉండే బస్సులు, మార్కెట్లలో గ్యాంగులు ఫోన్లను తస్కరిస్తుండగా, మరికొన్నిసార్లు ప్రజల అజాగ్రత్త వల్ల ఫోన్లు పోతున్నాయి.
Also Read: Betting Apps promotion: బెట్టింగ్ యాప్‌ల ప్రమోటర్లు అరెస్ట్!
గతంలో ఫోన్ (Phone) పోతే తిరిగి దొరికే పరిస్థితి ఉండేది కాదు. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసు శాఖ సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీ అయిన ఫోన్ల వివరాలను పోలీసులు నమోదు చేస్తున్నారు. ఐటీ సెల్ సిబ్బంది ఈ వివరాలపై నిఘా పెడతారు. (Phone) ఫోన్‌లోని సిమ్ కార్డును మార్చి ఆన్ చేయగానే, దాని కొత్త నంబర్‌తో సహా అన్ని వివరాలు పోలీసులకు అందుతాయి. దీని ఆధారంగా పోలీసులు (Police) (Phone) ఫోన్ నంబర్లకు కాల్ చేసి, వాటిని రికవరీ చేస్తున్నారు.
రాచకొండ కమిషనరేట్‌లోని ఎల్బీనగర్, మల్కాజిగిరి, భువనగిరి జోన్‌ల సీసీఎస్ పోలీసు బృందాలు ఈ 1,130 సెల్‌ఫోన్లను రికవరీ చేశాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొత్తం 3,694 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్లను సొంతదారులకు అప్పగించిన సందర్భంగా సీపీ సుధీర్ బాబు, (Rachakonda CP Sudheer Babu) ఈ రికవరీలో కీలక పాత్ర పోషించిన క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబు, (Crimes DCP Arvind Babu) ఏసీపీ కరుణసాగర్, సీసీఎస్, ఐటీ సెల్ సిబ్బందిని అభినందించారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి రావడంతో యజమానులు ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: Air India Flights: ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. ఆ దేశాలకు మళ్లీ విమాన సేవలు!