Man Vs Leopard (Image Source: Twitter)
Viral, లేటెస్ట్ న్యూస్

Man Vs Leopard: ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్.. తారక్ తరహాలో చిరుతతో సామాన్యుడి ఫైట్.. వీడియో వైరల్!

Man Vs Leopard: సాధారణంగా చిరుత (leopard) ను దూరం నుంచి చూస్తేనే గజ గజ ఒణికిపోతుంటారు. ఖర్మ కాలి దగ్గరకు వస్తే.. సురక్షిత ప్రాంతానికి పరిగెత్తికెళ్లి ప్రాణాలను కాపాడుకుంటాం. అయితే ఓ వ్యక్తి ఇందుకు పూర్తి భిన్నం. ఊర్లోకి వచ్చిన చిరుతను చూసి ఏమాత్రం భయపడలేదు. ఒళ్లుగగుర్పొడిచే విధంగా దానితో పోరాడాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పెద్దపులితో పోరాడినట్లు.. సింగిల్ గా చిరుతతో తలపడ్డాడు. యూపీకి చెందిన ఓ యువకుడు చేసిన ఈ సాహసానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ ధౌర్ పుర్ ఫారెస్ట్ రేంజ్ పరిధి (Dhaurpur Forest range)లోని లఖింపూర్ ఖేరి (Lakhimpur Kheri) ప్రాంతంలో చిరుత హల్ చల్ చేసింది. గ్రామానికి పొలిమేరల్లో ఉండే ఇటుక బట్టీపై చిరుత దాడి చేసింది. దీంతో బట్టిలో పనిచేసే కార్మికులంతా తలోదిక్కు పరిగెత్తారు. చిరుత నుంచి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ఇటుల బట్టిలపైకి ఎక్కాడు. ఈ క్రమంలో గిర్దారి పూర్వా నివాసి మిహిలాల్ (35)పై చిరుత దాడికి యత్నించింది.

చిరుతపై ఎదురుదాడి!
చిరుత దాడికి యత్నించడంతో మిహిలాల్ (Mihilal) దానికి ఎదురుతిరిగాడు. చిరుత మెడను గట్టిగా పట్టుకొని దానిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ క్రమంలో చిరుతకు, యువకుడికి మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. యువకుడి ఉడుం పట్టు నుంచి తప్పించుకునేందుకు చిరుత ఎంతగానో ప్రయత్నించింది. చిరుతను గట్టిగా బందించడాన్ని గమనించిన స్థానికులు.. దానిపై ఇటుక రాళ్లతో దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ కెమెరాలో బందించాడు.

Also Read: Air India Flights: ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. ఆ దేశాలకు మళ్లీ విమాన సేవలు!

రంగంలోకి అటవీశాఖ అధికారి
మరోవైపు ఇసుక బట్టిలోకి చిరుత ప్రవేశించిన విషయాన్ని స్థానికులు.. అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారి నృపేంద్ర చతుర్వేది.. తన బృందంతో కలిసి ఘటన స్థలికి చేరుకున్నాడు. చిరుతను శాంతింపజేసి దానిని బందించాడు. చిరుత దాడిలో మిహిలాల్ కు స్వల్పంగా గాయాలు అయ్యాయి. మరోవైపు రాళ్లతో కొట్టడంతో చిరుతకు సైతం దెబ్బలు తగిలినట్లు అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. దానికి చికిత్స అందించి.. సమీపంలోని అడవిలో విడిచిపెట్టనున్నట్లు పేర్కొన్నారు.

Also Read This: USA – India: భారత్‌లోని అమెరికన్లకు బిగ్ వార్నింగ్.. ట్రంప్ సర్కార్ సంచలన ఆదేశాలు

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!