Kamalapur Pedda Lake: హనుమకొండ(Hnumakonda) జిల్లాలలోని అతి పెద్ద చెరువుల్లో ఒకటి అయిన కమలాపూర్(Kamalapur) పెద్ద చెరువుకు కోలుకోలేని పెద్దకష్టం వచ్చిపడింది. సుమారు 800 వందల సంవత్సరాల క్రితం కాకతీయుల కాలంలో నిర్మించినట్టు చెబుతున్న చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కమలాపూర్ పెద్ద చెరువు నిత్యం వేలాది ఎకరాల పంట పొలాలకు సాగు నీరు అందించడంతోపాటు అనేక గ్రామాలకు తాగు నీటికి ప్రధాన ఆదారంగా నిలువడంతోపాటు మత్స్య సంపదతో వందలాది కుటుంబాలకు జీవనాదారంగా నిలుస్తుంది.
అనేక గ్రామాలకు ప్రధాన నీటి వనరుగా
అటువంటి పెద్ద చెరుకువును పట్టించుకున్న నాధుడే లేకుండా పోయారు. కమలాపూర్ మండలంలోని అనేక గ్రామాలకు ప్రధాన నీటి వనరుగా ఉన్న పెద్ద చెరువు శిథిలావస్థకు చేరుకున్న అధికారులు పట్టించుకోవడంలేదు. మత్తడి తెగిపోయిన కట్ట మట్టిని పలువురు రైతులు తవ్వి కట్టకు నష్టం చేస్తున్న, తూములు పూర్తిగా శిథిలం అయ్యి గేట్లు పని చేయకుండా పోయాయన నీటిపారుదల శాఖ(Irrigation Department) అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద తూమ్ శిథిలం.. కట్టకు పొంచి ఉన్న ప్రమాదం
కాకతీయుల కాలంలో ముల్కనూర్ లో ప్రారంభం అయ్యి కోతులనడుమ మీదుగా ప్రవహించే వాగుకు అడ్డంగా 800 ఏండ్ల క్రితం సుమారు 1000 వెయ్యి ఎకరాల శిఖం భూమి(Land)లో నాలుగు కిలోమీటర్ల పొడవు కట్టతో కమలాపూర్ పెద్ద చెరువు నిర్మాణం చేశారు. ఈ చెరువు సుమారు వేల ఎకరాల భూమికి ప్రత్యక్షంగా,పరోక్షంగా మరో 2000 వేల ఎకరాలకు పైగా పంటలకు ఉంటా కాలువల సాగునీరు అందిస్తుంది. చెరువులో నీరు నిలువ ఉండడంతో భూగర్భ జలాల మట్టం పెరిగి చుట్టుపక్కల పది గ్రామాల్లో బావులు, బోరు బావుల్లో నీటిమట్టం పెరిగి పంటల సాగుకు ఉపయోగ పడుతుంది. ఇతర ప్రాధాన్యత ఉన్న చెరువు పెద్ద తూమ్ గేటు, గేట్ వాల్ శిథిలం అయ్యి నీరు వృధా అవుతుంది.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై.. సీబీఐ విచారణ జరగాలి!
బుంగలు పెద్దవై కట్టకు ప్రమాదం
తూమ్ కట్టడంలో పలు చోట్ల బుంగలు ఏర్పడి నిత్యం నీరు తూము ద్వారా వృధాగా పోతుంది. ధూమ్ కట్టడానికి బుంగలు ఏర్పడిన విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే బుంగలు పెద్దవై కట్టకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని రైతులు(Farmers) ఆందోళన చెందుతున్నారు. తూము షట్టర్ శిథిలం అయ్యి నీరు వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో దొంగతనంగా తూము ఎత్తి నీటిని వృథాగా వదిలేస్తున్న అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని, రాత్రి సమయంలో నీటిని భారీగా వదిలి వేయడంతో తమ పంట పొలాల గెట్లు పాడు అవుతున్నాయని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రెండు సంవత్సరాల క్రితం కూలిన మత్తడి
కాకతీయుల కాలంలో అత్యంత పటిష్టంగా రాతితో నిర్మాణం చేసిన మత్తడికి ఇరు వైపుల అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టడంతో మత్తడి పట్టు లేకుండా పోయి రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వరదకు చిన్న మత్తడి పూర్తిగా కొట్టుకుపోయింది. చిన్న మత్తడి కొట్టుకుపోయి చెరువులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిన అడిగే నాధుడే లేకుండా పోయారు. రెండు సంవత్సరాలుగా కూలిపోయిన మత్తడిని పునర్నిర్మించాలనే ఆలోచన అధికారులకు రాకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొట్టుకు పోయిన చిన్న మత్తడిని వెంటనే నిర్మాణం చేయకుంటే వరద ఉధృతి పెరిగితే పెద్దమత్తడి కూడ కొట్టుకు పోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కట్టనే తవ్వుతున్నారు.
చెరువు కట్ట కింద భూమి సాగు చేసుకునే పలువురు రైతులు ఇష్టారాజ్యంగా కట్టమట్టిని తవ్వి కట్టకు నష్టం కలిగేలా వ్యవహరిస్తున్నారు. కట్ట మట్టి తవ్వి పొలాల్లో పోసుకుని కట్టకు నష్టం చేస్తున్నారనే విషయం నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన వారు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కట్ట చెరువు భూమికి హద్దులు నిర్ణయించి కట్టను, చెరువు శిఖం భూమిని కాపాడాలి రైతులు కోరుతున్నారు.
Also Read: Renu Desai: మీకు దండం పెడతా.. నాకు సాయం చేయండంటూ పోస్ట్ పెట్టిన రేణు దేశాయ్?
తూమ్ శిథిలం.. కట్టడానికి బుంగలు చూస్తే భయమేస్తుంది
పెద్ద తూము షేటర్ పూర్తిగా శిథిలం అయ్యింది. మత్తడి కట్టడం అనేక బుంగలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. దీంతో చెరువు నిండిన ప్రయోజనం లేకుండా పోతుంది. షేటర్ ద్వారా పెద్ద మొత్తంలో నీరు వృథాగా పోతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే చెరువు కట్టకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. చెరువుకు ఏదైనా ప్రమాదం జరిగితే చెరువు కింది గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికైన అధికారులు చెరువును పరిశీలించి ముందస్తు ప్రమాద నియంత్రణ చర్యలు చేపట్టాలి.
రవి, మత్స్య కార్మికుడు
రెండు సంవత్సరాల క్రితం అమలాపూర్(Amalapur) పెద్ద చెరువు చిన్న మత్తడి వరదలకు కొట్టుకుపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు అధికారులు కనీసం పునర్నిర్మానంపై దృష్టి సాలించలేదు. వరదలు ఉదృతమైతే పెద్ద మొత్తానికి కూడా ప్రమాదం పొంచి ఉంది. నీటి నిలువ సామర్థ్యం ఎప్పటికీ పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఒక్కసారి చెరువు నిండితే నాలుగు పంటలు పండేవి. ఇప్పుడు కనీసం రెండు పంటకు కూడా నీళ్లు సరిపోవడం లేదు. వెంటనే అధికారులు స్పందించి మత్తడి పునరుద్ధరణ పనులు చేపట్టాలి.
మొగిలి, రైతు: చెరువుకు ప్రమాదం పొంచి ఉంది
కమలాపూర్ పెద్ద చెరువు మత్తడి కూలిపోవడంతోపాటు తూములు శిధిలావస్థకు చేరుకోవడంతో చెరువుకు ప్రమాదం పొంచి ఉంది. వర్షాలు(Rain) పెరిగి వరదలు ఉద్ధృతమై జరగరాని ప్రమాదం జరిగితే పంట పొలాలు నామరూపాలు లేకుండా పోవడంతో పాటు పలు గ్రామాలకు వరద ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి కమలాపూర్ చెరువు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి.
Also Read: Renu Desai: మీకు దండం పెడతా.. నాకు సాయం చేయండంటూ పోస్ట్ పెట్టిన రేణు దేశాయ్?