Phone Tapping Case( IMAGE CREDIT: swetcha reporter)
తెలంగాణ

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై.. సీబీఐ విచారణ జరగాలి!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) డిమాండ్ చేశారు. (Ranga Reddy) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ (Shad Nagar) నియోజకవర్గ పరిధిలోని కమ్మదనం గ్రామంలో బిజెపి (BJP) బూత్ కార్యకర్తల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీ డీకే అరుణ (DK Aruna) ప్రారంభించారు. ఎంపీ డీకే అరుణ DK Aruna) వెంట రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా అధ్యక్షులు పతంగి రాజగోపాల్ గౌడ్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, అందే బాబయ్య తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీకే అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వ్యవహారంపై గతం నుంచి ఫిర్యాదులు చేస్తూనే వచ్చామన్నారు.

 Also Read: Viral Video: భూమ్మీద నూకలు ఉన్నాయంటే ఇదేనేమో.. తప్పిన పెను ముప్పు!

సిబిఐ విచారణ జరగాలి

భార్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలు కూడా రికార్డు చేశారని, ఇది చాలా దుర్మార్గమని డీకే అరుణ  (DK Aruna) వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలు చెప్పి మామూలు కార్యకర్త ఫోన్ నంబర్లను కూడా ట్యాపింగ్ (Phone tapping) చేయడం దారుణమని ఆమె అన్నారు. ఏయే ప్రాంతాల్లో ట్యాపింగ్ జరిగాయో.. దీని వెనుక ఎవరున్నారో? బయటకు రావాలంటే దీనిపై సీబీఐ (CBI) విచారణ జరగాలని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా ఈ వ్యవహారంపై తాడోపేడో తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.

లేకపోతే కేసును సీబీఐకి (CBI) అప్పజెప్పాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, అందే బాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, చెంది మహేందర్ రెడ్డి దేపల్లి అశోక్ గౌడ్ మోహన్సింగ్, విజయభాస్కర్, ఇస్నాతి శ్రీనివాస్, చేగు సుధాకర్, చెట్ల వెంకటేష్ , వంశీకృష్ణ, పేట అశోక్, రంగన్న గౌడ్, లష్కర్ నాయక్, అనిల్ గౌడ్, శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 Also Read: BJP MP Kishan Reddy: బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం వెనుకబడింది.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్!

Just In

01

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..