Commercial Flat: రాజధాని పరిసర ప్రాంతాల్లోని హౌసింగ్ బోర్డుకు చెందిన భూముల బహిరంగ వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతంలోని ఒక కమర్షియల్ ప్లాట్‌ను ఏకంగా రూ.33 కోట్లకు కొనుగోలు చేయడానికి ముందుకు రాగా, మరో చోట రూ.13.51 కోట్లు పలికింది. రెండు ఎంఐజీ ప్లాట్లను సుమారు 4.50 కోట్లకు పైగా వెచ్చించి బహిరంగ వేలంలో దక్కించుకోడానికి పోటీపడ్డారు. అలాగే చింతల్ ప్రాంతంలోని ప్లాట్లను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. మొత్తం 11 ప్లాట్లను వేలం వేయగా రూ.65.02 కోట్ల మేర ఆదాయం వచ్చిందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ (Gautham) తెలిపారు.
Also Read: TG HC On Local Body Election: స్థానిక సంస్థల ఎన్నికలపై.. హైకోర్టులో విచారణ!
రూ.65.02 కోట్లు బోర్డుకు ఆదాయం
నగరంలోని చింతల్, గచ్చిబౌలి, (Gachibowli) నిజాంపేట (Nizampet) తదితర ప్రాంతాల్లో వివిధ రకాలైన ప్లాట్లకు హౌజింగ్ బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. చింతల్ ప్రాంతంలో 266 చదరపు గజాల విస్తీర్ణంలోని రెసిడెన్షియల్ ప్లాట్లు, గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతంలో కమర్షియల్ ప్లాట్లు, నిజాంపేటలో 413 చదరపు గజాల ప్లాట్లు వీటిలో ఉన్నాయి. కూకట్‌పల్లి (Kukatpally) కేపీహెచ్‌బీ (KPHB) కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నిర్మించిన ఈ స్థలాల వేలంలో 55 మంది పాల్గొన్నారని హౌసింగ్ కమిషనర్ పేర్కొన్నారు. గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతంలో 3,271 చదరపు గజాల భూములు, చింతల్ ప్రాంతంలో 799.98 చదరపు గజాలు, నిజాంపేటలో 1653 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ప్లాట్లను వేలం వేయగా రూ.65.02 కోట్లు బోర్డుకు ఆదాయంగా వచ్చిందని వెల్లడించారు.
గచ్చిబౌలి భూములకే రూ.56 కోట్లు
గచ్చిబౌలి (Gachibowli) హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న 1487 గజాల కమర్షియల్ ల్యాండ్‌ను గజానికి రూ.2.22 లక్షలు చొప్పున సుమారు రూ.33 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ భూములకు చదరపు గజానికి 1.20 లక్షలను ఆఫ్ సెట్ ధరగా నిర్ధారించగా వేలం పాటలో అది 2.22 లక్షలు పలికింది. అలాగే ఇదే ప్రాంతంలోని 1200 గజాల పాఠశాల భూములకు ఆఫ్ సెట్ ధర చదరపు గజానికి 80 వేలుగా నిర్ధారించగా, వేలంలో ఆ భూములకు రూ.1.12 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే ఇక్కడి రెండు ఎంఐజీ ప్లాట్లు చదరపు గజం రూ.1.86 లక్షలు, రూ. 1.32 లక్షల ధరలు పలికాయి. ఒక్క గచ్చిబౌలి (Gachibowli) ప్రాంతానికి సంబంధించిన భూముల ద్వారానే రూ.55,56,84,000(రూ.55 కోట్ల 56 లక్షల 84 వేల) ఆదాయం హౌసింగ్ బోర్డుకు సమకూరింది.
చింతల్ భూముల రేట్లు ఆకాశానికి
కుత్బుల్లాపూర్ మండలంలోని చింతల్ ప్రాంతంలోని హౌసింగ్ బోర్డు ఎంఐజీ ప్లాట్లు కూడా అత్యధిక ధరలతో బహిరంగ వేలంలో అమ్ముడుపోయాయి. ఈ ప్రాంతంలో మొత్తం పది ప్లాట్లను వేలం వేయగా, వీటిలో ప్లాట్ నెంబర్ 113, 114, 115 ద్వారానే సుమారు రూ.8.11 కోట్ల మేర ఆదాయం వచ్చింది. నిజాంపేట- బాచుపల్లిలోని 4 ప్లాట్లను సుమారు రూ.70 లక్షలకు వేలంపాటలో కొనుగోలు చేశారు.
Also Read: Loans to Women: సంఘాల్లో సభ్యురాలిగా ఉన్న వ్యక్తికి సైతం రుణం!